ఏ గాసిప్స్ లేని ఐదుగురు టాలీవుడ్ హీరోయిన్లు..?
1. సుమలత
కెరీర్ ప్రారంభం నుంచి డీసెంట్ రోల్స్ చేస్తూ పద్ధతిగల హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సుమలత పై ఇప్పటివరకు ఎటువంటి గాసిప్స్ రాలేదు. సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన ఈమెకు ఎవరితోనూ అఫైర్ ఉన్నట్టు వార్తలు రాలేదు. 1991లో పెళ్లి చేసుకున్న ఆమె తన భర్త అంబరీష్ తో చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు.
2. ఊహ
సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి తర్వాత హీరో శ్రీకాంత్ తో ప్రేమాయణం నడిపి ఆయననే పెళ్లి చేసుకున్న ఊహ చక్కగా లైఫ్ లో సెటిల్ అయ్యారు. ఆమె గురించి కూడా ఎటువంటి గాసిప్స్ రాలేదు.
3. సుజాత
సినిమాల్లో అడుగుపెట్టే సమయానికి సుజాతకు ఇద్దరు పిల్లలు. ఆమె చాలా సాంప్రదాయికమైన కుటుంబం నుంచి వచ్చారు. కెరీర్ మొత్తంలో ఏ సన్నివేశంలోనూ పరిధులు దాటి నటించిన దాఖలాలు లేవు. ఆమె ఎక్కడా ఏ గాసిప్స్ లేకుండా చివరి వరకు సినిమా ఇండస్ట్రీలో కొనసాగారు.
4. నమ్రతా శిరోద్కర్
మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ కూడా అఫైర్ పెట్టుకున్నట్టు ఎన్నడూ వార్తలు రాలేదు. మిస్ ఇండియా కెరియర్ తో ఎన్నో ఆఫర్స్ ని చేజిక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ వంశీ సినిమా చేస్తున్న సమయంలో మహేష్ బాబు తో ప్రేమలో పడ్డారు. ఇక ఆ తర్వాత మహేష్ ని పెళ్లి చేసుకొని ఎంతో సంతోషకరమైన జీవితాన్ని కొనసాగిస్తున్నారు.
5. భూమిక చావ్లా
ఎన్ని కమర్షియల్ సినిమాలు చేసినా, సరే.. భూమిక తన పరిధి దాటి నటించిన దాఖలాలు లేవు. అవకాశాలు వచ్చినంత కాలం చక్కగా సినిమాలు చేసుకుని ఆపై పద్ధతిగా పెళ్లి చేసుకొని జీవితంలో సెటిల్ అయిపోయారు.