ప్రభాస్ కి ఆ హీరోయిన్ సెట్ అవుతుందా.?

praveen
ఒకప్పటి టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. బాహుబలి తర్వాత ఒక్కసారిగా ప్రభాస్ రేంజ్ పెరిగిపోయింది . ఇక సాహో సినిమా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోక పోయినప్పటికీ అందరిచూపు ఈ టాల్ హీరోపై పడేలా చేసింది.  ఈ క్రమంలోనే ఇక అందరు దర్శకులు ప్రభాస్ వరకు తమ స్టోరీస్ తో క్యూ కడుతున్నారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలు అన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలు కావడం గమనార్హం. ఇలా వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ.. పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు ప్రభాస్.  టాలీవుడ్ బాలీవుడ్ అనే తేడా లేకుండా అంతటా అభిమానులను సంపాదించుకుని తన సినిమాలపై అంచనాలు పెంచేస్తున్నాడు.



 ఇప్పటికే వరుసగా పాన్ ఇండియా సినిమాలు నటిస్తూ దూసుకుపోతున్నాడు ప్రభాస్. ఇక ప్రస్తుతం ప్రభాస్ భారీ బడ్జెట్ సినిమా అయినా ఆదిపురుష్ లో నటిస్తున్నాడు  ఆ తర్వాత సినిమా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది.  ఇక ఈ సినిమా ముగియగానే మరికొన్ని సినిమాలను లైన్లో పెట్టేస్తున్నాడు డార్లింగ్ హీరో. బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ ఒక సినిమా చేసేందుకు నిర్ణయించింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అన్నదానిపై గత కొంత కాలంగా సోషల్ మీడియాలో చర్చ జరగగా ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్గా కత్రినాకైఫ్ నటించబోతుందన్న టాక్ వినిపిస్తోంది.



 అయితే కత్రినాకైఫ్ అని పేరు వినిపిస్తున్నప్పటికీ ఈసారైనా ఈ హీరోయిన్ ప్రభాస్ సరసన నటిస్తుందా లేదా ఈ జోడీ సెట్ అవుతుందా లేదా అన్నది ప్రేక్షకులు అనుమాన పడుతున్నారు.  ఎందుకంటే గతంలో ప్రభాస్ నటించిన సాహో సినిమా లో ముందుగా కత్రినాకైఫ్ హీరోయిన్ గా తీసుకున్నారు అన్న టాక్ వినిపించింది. కానీ ఆ తర్వాత మాత్రం కత్రినాకైఫ్ పక్కకు వెళ్లి పోయింది.ఇక ఆ తర్వాత నాగ్ అశ్విన్ సినిమా కోసం కూడా కత్రినాకైఫ్ హీరోయిన్ టాక్ వినిపించింది. అది కూడా కుదరలేదు.ఇక ఇప్పుడు మరో సారి సిద్ధార్థ్ ఆనంద్ సినిమాలో ప్రభాస్ సరసన కత్రినా కైఫ్ నటిస్తుంది అనే టాక్ వినిపిస్తోంది. మరి ఈసారైనా ప్రభాస్ తో హీరోయిన్ సెట్ అవుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: