ప్రియాంక చోప్రా బాటలో మరో హీరోయిన్ ... సాహసమే ?

VAMSI
హాలీవుడ్ సినిమా అంటే ఓ రేంజ్ లో ఉంటుంది. సినీ పరిశ్రమలో హాలీవుడ్ దే టాప్ ప్లేస్. ఇక ఒక ఇండస్ట్రీలోని నటీనటులు మరో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం ఒకప్పుడు ఇదో ప్రతిష్టాత్మక విషయం...అందులోనూ మన ఇండియన్ స్టార్స్ హాలీవుడ్ సినిమాల్లో కనిపించడం  అసాధ్యం అన్నట్లుగా   ఉండేది. కనీసం ఏ చిన్న పాత్రలలో కూడా మన ఇండియన్ యాక్టర్స్ కనిపించడం జరగలేదు.  కానీ కాలం మారుతున్న కొద్దీ మన ఇండియన్ సినిమా స్థాయి కూడా మారింది. మన యాక్టర్స్ యాక్షన్ తో దుమ్మురేపుతూ హాలీవుడ్ స్టార్స్  స్థాయికి ఏమాత్రం తీసిపోరని నిరూపించుకుంటున్నారు. 


ఇప్పటికే ఎన్నో ఇండియన్ సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుతో హాలీవుడ్ లో సైతం డబ్ అయ్యి అక్కడ విశేష స్పందన తెచ్చుకొని విజయాన్ని సొంతం చేసుకున్నాయి.
ఈ ఘనత అంతటితో ఆగలేదు... మన ఇండియన్ స్టార్స్ కూడా డైరెక్ట్ గా హాలీవుడ్ సినిమాల్లో నటించే అవకాశాలు పొందుతున్నారు. భారతీయ నటి అయిన ప్రియాంక చోప్రా హాలీవుడ్ సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు వెబ్ సిరీస్ ల హవా నడుస్తున్న తరుణంలో పలు హాలీవుడ్  వెబ్ సిరీస్ లలో  మన ఇండియన్యాక్టర్స్ ఛాన్సులు కొట్టేస్తున్నారు.  


ఇండియన్ నటి అయినా హ్యూమా ఖురేషీ ఇప్పటికే ఓ ప్రాజెక్టు సొంతం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. "ఆర్మీ ఆఫ్ ది డెడ్" అనే  టైటిల్ తో రూపుదిద్దుకుంటున్న వెబ్ సిరీస్ లో హ్యూమా ఖురేషీ కీ రోల్ పోషించనన్నట్లు తెలుస్తోంది. ఇంగ్లీషు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్ మరో రెండువారాల్లో నెట్ ప్లిక్స్ లో స్ట్రీమింగ్ అవడానికి ముస్తాబయింది. ఈ వెబ్ సీరీస్ తనకు హాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు తెచ్చిపెడుతుందని ఖురేషి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రియాంక లాగే ఈమె కూడా హాలీవుడ్ లోనే సెటిల్ అవుతుందా చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: