ఫాన్స్ కోసం స్మోకింగ్ కు దూరం అయిన 10 మంది స్టార్స్..?

Divya

సాధారణంగా మనం సినిమాలలో హీరోలు స్టైల్ గా సిగరెట్ కాల్చే విధానాలను ప్రతి ఒక్కరు చూస్తూనే ఉంటారు. హీరో వారిదైన స్టైల్ లో సిగరెట్లు కాలుస్తూ ఉంటే.. అబ్బా మా హీరో చూడండ్రా..ఎంత స్టైల్ గా సిగరెట్ కాలుస్తున్నాడో.. అంటూ ఆ హీరో అభిమానులు వారి స్నేహితుల దగ్గర కాలర్ ఎగరేసుకుని మరీ చెప్పు కుంటూ ఉంటారు.. అలా చెప్పడం వరకు అయితే ఓకే..పర్వాలేదు.. కానీ సిగరెట్టు కాలుస్తున్న ఆ హీరో ని స్ఫూర్తిగా తీసుకొని, వారి అభిమానులు కూడా ధూమపానం చేయడం మొదలుపెడితే.. ఇక అంతే ఆ  తర్వాత ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది.. ఎందుకంటే నిజ జీవితంలో కూడా ఇలా హీరోలను అనుసరిస్తున్న వాళ్లు కూడా లేకపోలేదు..


సాధారణంగా సినిమా  థియేటర్లలో టైటిల్ పడకముందే ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అంటూనే మరోవైపు ఈ సినిమాల్లో నటించే నటీనటులతో కామెంట్రీ చూపించినా పట్టించుకునేవాళ్ళు చాలా తక్కువ మందే ఉన్నారు .దాని పై సెటైర్లు వేసే వాళ్ళు కూడా ఎక్కువే.. ఎందుకంటే సినిమా టైటిల్ కి ముందు ఇలా చెప్పి, ఆ తర్వాత సినిమాల్లో హీరోలు సిగరెట్లు కాలుస్తూ ఉంటే ,ఎవరు మాత్రం దానిని అనుసరిస్తారు చెప్పండి.. నిజానికి నిజ జీవితంలో చాలామంది స్టార్ హీరోలు కూడా స్మోకింగ్ చేస్తూ ఉంటారు .అది బహిరంగ రహస్యమే అయినప్పటికీ ,మొదట్లో కొంత మంది స్మోకింగ్ చేసినప్పటికీ, ఆ తర్వాత వారు రియలైజ్ అయ్యి , ఇప్పటివరకు దాని జోలికి వెళ్లకుండా, వారి ఫ్యాన్స్ కు ఎంతో ఆదర్శంగా నిలిచారు.. అంతేకాకుండా వారి అభిమానులకు కూడా దయచేసి స్మోకింగ్ మానేయండి ..అంటూ విన్నవించుకోవడం కూడా జరిగింది.. మరైతే ఎవరెవరు స్మోకింగ్ ని మానేసారో ఇప్పుడు తెలుసుకుందాం..


1. కమల్ హాసన్:
ఈయన అతి చిన్న వయసులోనే అంటే 11 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు సిగరెట్ కాల్చడం మొదలు పెట్టారు. అయితే కొన్నేళ్ల తర్వాత ఈ అలవాటుకి పూర్తిగా స్వస్తి చెప్పారు..

2. రజినీకాంత్:
రజినీకాంత్ కూడా డిసెంబర్ -2012 - 12వ తేదీన రజినీకాంత్ స్మోకింగ్  చేయడం మానేస్తున్నట్టు తెలియజేశారు .అంతేకాకుండా తన అభిమానులకు కూడా దాని జోలికి పోకూడదని కోరారు..

3. మహేష్ బాబు:
మహేష్ బాబు  తన స్నేహితుడు ఇచ్చిన ఒక పుస్తకాన్ని చదివిన తర్వాత, ఇన్స్పైర్ అయి స్మోకింగ్ వదులుకున్నాడు..

4. విజయ్ దేవరకొండ :
అర్జున్ రెడ్డి సినిమా తర్వాత పూర్తిగా స్మోకింగ్ మానేసాడు విజయ్.

5. పవన్ కళ్యాణ్:
పవన్ కళ్యాణ్ కేవలం ఖుషి సినిమా సమయంలో మాత్రమే స్మోక్ చేశాడు. ఆ తర్వాత దాని జోలికి కూడా పోలేదు..

6. రానా:
రానా  కూడా నేనే రాజు నేనే మంత్రి సినిమా సమయం వరకు స్మోక్ చేశాడు. కానీ ఆ తర్వాత ఈ అలవాటు దూరమయ్యాడు..

7. హృతిక్ రోషన్:
హృతిక్ రోషన్ కూడా కొంతకాలం తర్వాత రియలైజ్  అయ్యి దానికి స్వస్తి చెప్పాడు.

8. మమ్ముట్టి:
ఈయన కూడా గత ఏడు సంవత్సరాల క్రితం స్మోకింగ్ కు గుడ్బై చెప్పాడు.

9. సల్మాన్ ఖాన్:
సల్మాన్ ఖాన్ కూడా గతంలో చైన్ స్మోకర్ . ఆయన స్మోకింగ్ చేయడం వల్ల తన ఆరోగ్యం దెబ్బతింది.
డాక్టర్ల సలహా మేరకు ఈ  అలవాటుకు దూరమయ్యాడు..

10. అమీర్ ఖాన్:
అమీర్ ఖాన్ తన అభిమానుల కోసం అలాగే  తన పిల్లల రిక్వెస్ట్ మేరకు స్మోకింగ్ అలవాటుకు దూరమయ్యాడు..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: