ఐఏఎస్ అధికారిగా చరణ్ ..... మెసేజ్ తో కూడిన కమర్షియల్ మూవీ అట .....??

GVK Writings
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ సినిమా తో పాటు ఇటు ఆచార్య సినిమా కూడా చేస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ లో తొలిసారిగా ఎన్టీఆర్ తో కలిసి నటిస్తున్న చరణ్, ఆచార్య లో తొలిసారిగా తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ మూవీ ని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తుండగా ఇందులో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తుండగా ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించనున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.

ఇప్పటికే షూటింగ్ తుది దశకు చేరుకున్న ఈ సినిమా అక్టోబర్ 13న విడుదల కానుంది. మరోవైపు ఆచార్య కూడా 80 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకోగా దీనిని మొదట మే 13 న విడుదల చేయాలని భావించారు. అయితే ప్రస్తుతం మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ఉండటంతో విడుదల వాయిదా వేస్తున్నట్లు నిన్న యూనిట్ ప్రకటించింది. ఇక ఈ రెండు సినిమాల అనంతరం ప్రఖ్యాత దర్శకుడు శంకర్ దర్శకత్వంలో చరణ్ ఒక భారీ ప్రతిష్టాత్మక సినిమా చేయనున్న విషయం తెలిసిందే. దిల్ రాజు బ్యానర్ పై 50వ సినిమాగా రూపొందనున్న ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం కథ, స్క్రిప్ట్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

పలు టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా అవినీతి, లంచగొండితనం, అక్రమాల నేపథ్యంలో సాగుతుందని అలానే ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక ఐఏఎస్ అధికారి గా కనిపించనున్నారని మంచి మెసేజ్ తో కూడిన కమర్షియల్ ఎంటర్ టైనర్ మూవీగా దర్శకుడు శంకర్ దీనిని అద్భుతంగా తెరకెక్కించనున్నారని చెబుతున్నారు. గతంలో శంకర్ తీసిన ఒకే ఒక్కడు, జెంటిల్మెన్, శివాజీ తరహాలో ఈ మూవీ కూడా సాగుతుందట. కాగా ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు అతిత్వరలో వెల్లడికానున్నట్లు తెలుస్తుంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: