తెలుగునాట ఊపిన ఆ నలుగురు యాంకర్లు గుర్తున్నారా..?

Divya

బుల్లితెర టీవీలలో జెమినీ టీవీ లో ఒకానొక సమయంలో ఒక ట్రెండ్ ను క్రియేట్ చేసింది. ఈ ఛానల్ బాగా పాపులర్ అవడానికి కారణం ఇందులో వచ్చే  సీరియల్స్, సినిమాలు, అలాగే  ప్రోగ్రామ్స్ కూడా ముఖ్య కారణం అని కూడా చెప్పవచ్చు. ఈ ఛానల్ వచ్చి 30 సంవత్సరాల పైగా కావస్తోంది. జెమినీ టీవీలో ఒక వెయ్యి మంది దాకా యాంకర్ లు వచ్చి, తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకొని వెళ్లారు. అలాంటిది ఆఖర్లో 20 ఏళ్లుగా తమ కెరియర్ ను కంటిన్యూ చేస్తూ ఉన్నవాళ్ళు అయితే అందులో ఒక అయిదారుగురు మాత్రమే ఒక రేంజ్లో ఉన్నారు అని చెప్పవచ్చు..


ఈ బుల్లితెరపై ఎంతమంది యాంకర్స్ వచ్చినా  కొంతమంది మాత్రమే చెరగని ముద్ర వేసుకున్నారు . వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం ..

జాహ్నవి :
ఈమె జెమినీ టీవీలో ప్రసారమయ్యే డాన్స్ బేబీ డాన్స్  ప్రోగ్రామ్ ద్వారా మంచి పేరు తెచ్చుకుంది. ఈ షో కి యాంకరింగ్ చేసిన జాహ్నవిని మనం ఎప్పటికీ మర్చిపోలేము. ఈ ప్రోగ్రామ్ తో తన అందచందాలతో అందర్నీ ఆకట్టుకుంది జాహ్నవి. ఆ తర్వాత (యజ్ఞం, హ్యాపీ) ఈమె కొన్ని సినిమాలలో స్నేహితురాలు క్యారెక్టర్లో నటించింది.  ఆ తర్వాత రసూల్ ఎల్లూర్ ని పెళ్లి చేసుకొని బుల్లితెరకు దూరమైపోయింది.

జయతి:
ఇక జెమినీ మ్యూజిక్ ద్వారా పాపులర్ అయిన మరొక యాంకర్ జయతి. జెమినీ మ్యూజిక్ ఆదిత్య టీవీ గా స్టార్ట్ అయినప్పటి నుంచి అందులో 10 గంటలప్పుడు ప్రసారమయ్యే'వెన్నెల'షో కి దాదాపుగా 10 సంవత్సరాల పాటు యాంకరింగ్ చేసింది. ఆ తరువాత జయతి ..ఆ షో తప్పా,  మరి ఏ షో చేయలేదు.

అనుపమ:
ఇక బుల్లితెర జెమినీ లో నటించిన మరొక యాంకర్ అనుపమ. అప్పట్లో 'ఆట కావాలా పాట కావాలా' లాంటి షో ని అద్భుతంగా చేసింది. స్టార్ యాంకర్ ఇమేజ్ ను  సంపాదించుకున్న అనుపమ  ఇప్పుడు ఎక్కడ ఉందో.. ఏం చేస్తుందో ఎవరికీ తెలియదు.

అర్చన:
నీకోసం ద్వారా పరిచయమైన అర్చన, ఈ షోలో చాలా సంవత్సరాల పాటు కొనసాగింది. ఈ షో ద్వారా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత పెళ్లి చేసుకొని బుల్లితెరకు దూరంగా ఉంటోంది.
వీరంతా ఒకప్పుడు జెమినీ టీవీ యాంకర్స్ గా పని చేసి ప్రేక్షకులలో చెరగని ముద్ర వేసుకున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: