పవన్ కళ్యాణ్ సినిమాకు ఓటీటీ డేట్ ఫిక్స్..!

Suma Kallamadi
ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సూపర్ హిట్ అయినా సంగతి అందరికి తెలిసిందే. అయితే తమ సినిమాను 50 రోజుల వరకు ఓటిటిలో విడుదల చేసే ప్రసక్తే లేదంటూ చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు ముందు వచ్చిన రూమర్స్ నిజమయ్యాయి. దిల్ రాజు చెప్పిన మాటలే అబద్ధమయ్యాయి. ఏప్రిల్ 26న సినిమా ఓటిటిలో విడుదల అవుతుందంటూ ముందు నుంచి వార్తలు వచ్చాయి. అయితే 26 కాకుండా మరో నాలుగు రోజులు ఆలస్యంగా వస్తున్నాడు వకీల్ సాబ్. అంటే ఎప్రిల్ 30న అన్నమాట. తాజాగా ఇదే విషయాన్ని ఖరారు చేస్తూ ట్రైలర్ కూడా విడుదల చేసారు అమెజాన్ ప్రైమ్ వీడియో.

ఇక పవన్ మూడేళ్ళ తర్వాత నటించిన సినిమా కావడంతో భారీ అంచనాలతో వచ్చిన వకీల్ సాబ్.. 86 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. 90 కోట్ల బిజినెస్ చేసిన ఈ చిత్రం కరోనా కారణంగా వసూళ్ల వేటలో వెనకబడింది. సెకండ్ వేవ్ మొదలైన తర్వాత వకీల్ సాబ్ వచ్చింది. అయినా కూడా మూడు నాలుగు రోజుల వరకు వసూళ్ల సునామీ సృష్టించింది వకీల్ సాబ్. ఆ తర్వాత మెల్లగా చల్లబడింది. ఇందులో అంజలి, నివేదా థామస్, అనన్య కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది.

అయితే దీనికోసం 35 కోట్లకు పైగానే చెల్లించారనే ప్రచారం కూడా జరుగుతుంది. మరోవైపు శాటిలైట్ హక్కులు కూడా భారీగానే అమ్ముడయ్యాయి. దీనికోసం 15 కోట్ల వకు పెట్టినట్లు తెలుస్తుంది. ఏదేమైనా కూడా విడుదలైన మూడు వారాలకే వకీల్ సాబ్ సినిమాను ఓటిటిలో విడుదల చేస్తున్నారు. బయట పరిస్థితులు బాగోలేకపోవడంతో రిస్క్ తీసుకోకుండా సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేస్తున్నారు దర్శక నిర్మాతలు. థియేటర్‌లో పవన్ సినిమాను మిస్ అయ్యాం అనుకున్న వాళ్లు హాయిగా ఇంట్లోనే కూర్చుని చూడొచ్చన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: