ఈ హీరోయిన్స్ కి పెళ్లయింది అంటే ఎవరు నమ్మరు..!
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ అందంగా ఉండడం కోసం , ఎన్నో రకాల పద్ధతులలో ఫిట్నెస్ ను మెయింటెన్ చేయడంతో పాటు, ఆరోగ్య నియమాలను కూడా పాటిస్తూ ఉంటారు. ఇక అలాగే ఎన్నో రకాల డైట్ లు పాటిస్తూ, జ్యూస్ లు ఎక్కువగా తాగుతూ , యోగాసనాలు కూడా వేస్తూ ఉంటారు . మరీ ముఖ్యంగా వీరు అందంగా కనిపించడం కోసం, మేకప్ అనే ఒక బ్రహ్మాస్త్రాన్ని కూడా ఉపయోగిస్తున్నారు. ఈ మేకప్ వేసుకోవడం వల్ల వీళ్ళ ఏజ్ ను కనపడకుండా వుంటుంది. అసలు విషయానికొస్తే , మన సినీ ఇండస్ట్రీలో కొంత మంది టాలీవుడ్ భామలు పెళ్లి అయినా కూడా పెళ్లికాని అమ్మాయిలు గా అందంగా కనిపిస్తున్నారు. వీళ్లను చూస్తే ఎవరైనా సరే ఏంటి వీళ్లకు పెళ్లయిందా అని నోరెళ్లబెడుతారు.. అయితే ఆ భామలు ఎవరో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..
ఆకాంక్ష సింగ్:
సుమంత్ హీరోగా, జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన చిత్రం మళ్లీ రావా. ఈ చిత్రంలో ఈమె హీరోయిన్ గా పరిచయమైంది . ఆతర్వాత దేవదాస్ చిత్రంలో కూడా నటించింది . అయితే ఆకాంక్ష సింగ్ కు కునాల్ సింగ్ అనే ఒక సీరియల్ యాక్టర్ తో 2012లో పెళ్లి అయిన సంగతి చాలా మందికి కూడా తెలియదు..
అదితి రావు హైదరి:
ఈమె అందం గురించి వర్ణించడానికి మాటలు రావు . ఈమె మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన చెలియా అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది . ఆ తర్వాత పద్మావత్, సమ్మోహనం ,అంతరిక్షం , వీ వంటి సినిమాలలో కూడా నటించింది . 2009లో సత్యదేవ్ మిశ్రాను వివాహం చేసుకున్న విషయం కూడా చాలామందికి తెలియదు. కానీ వీళ్ళు 2013లో విడిపోవడం కూడా జరిగింది..
రాధిక ఆప్టే:
క్యూట్ క్యూట్ గా అనిపించే ఈ రాధిక రక్త చరిత్ర, లెజెండ్, లయన్ వంటి సినిమాలతో, తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. ఈమె బెనెడిక్ట్ టేలర్ అనే వ్యక్తితో డేటింగ్ చేసి, 2013లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది..
నజ్రియా:
రాజా రాణి చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నజ్రియా, ఇప్పుడు నాని హీరోగా తెరకెక్కుతున్న చిత్రం "అంటే సుందరానికి" అనే చిత్రంలో నటిస్తోంది . ఇక ఈమె 2014 లో ఫయాద్ ఫాజిల్ ను వివాహం చేసుకుంది. ఇతను ఇప్పుడు అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న పుష్ప చిత్రంలో విలన్ గా తెలుగు ప్రేక్షకులకి పరిచయం కాబోతున్నాడు.
హిమజ:
సీరియల్స్ లో హీరోయిన్ గా నటించిన హిమజ ,అటు తర్వాత నేను శైలజ, శతమానంభవతి ,మహానుభావుడు , ధ్రువ , స్పైడర్ , వినయ విధేయ రామ వంటి చిత్రాలలో నటించింది. 2012లో రాజేష్ అనే ఒక బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకుంది.
ఇక వీరే కాదు మమతామోహన్ దాస్, నీతి టేలర్, షాలిని వడ్నీ కట్టి, సనాఖాన్ ,అనీషా అంబ్రోస్ వీరందరికీ కూడా పెళ్లిళ్లు అయ్యాయి. కానీ చూడగానే వీరికి ఇంకా పెళ్లి కాలేదేమో అని అనుకునేంతగా, వీరి అందం అందరినీ ఆకట్టుకుంటుంది.