మహేష్ అభిమానులకు ఊహించని షాక్.. ఆగిపోయిన సర్కారి వారి పాట షూటింగ్..?
కరోనా వైరస్ కేసులు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం పలు సినిమా షూటింగ్ లు నిలిచిపోతున్నాయి. ఇప్పటికే ఎంతోమంది నటీనటులు కరోనా వైరస్ బారిన పడుతూ హోమ్ క్వారంటైన్ కి మాత్రమే పరిమితం అవుతున్నారు. ఇక ఆయా నటీనటులు కరోనా వైరస్ బారిన పడుతూ ఉండడం తో సినిమా షూటింగులకు కూడా బ్రేక్ ఏర్పడుతుంది. అయితే ఇటీవల కరోనా వైరస్ ప్రభావం మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాపై కూడా పడినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం మహేష్ బాబు కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో సర్కార్ వారి పాట సినిమా షూటింగ్ ఆగిపోయినట్లు తెలుస్తుంది. ఇటీవలే సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్ లో స్టార్ట్ చేయగా చిత్ర యూనిట్లో ఐదుగురికి వైరస్ సోకింది. దీంతో షూటింగ్ మొత్తం నిలిపివేస్తూ చిత్ర బృందం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే అందరూ కూడా సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్ళినట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమాకు సంబందించిన షూటింగ్ మొదటి నుండి వాయిదా పడుతూ వస్తుంది అన్న విషయం తెలిసిందే.