తన తదుపరి సినిమా ఎవరితో చెయ్యాలో క్లారిటీ లేక త్రివిక్రమ్ ఫుల్ డిస్టర్బ్ గా వున్నాడట....
ఇక అల్లు అర్జున్ తన 19 వ సినిమా కొరటాలతో ఉంటుందా అని డైలమాలో పడితే ఆ సినిమా నిర్మాణ సంస్థ యువ సుధ ఆర్ట్స్ 'తప్పక ఉంటుంది' అని ప్రకటించి క్లారిటీ ఇచ్చేసింది. ఈలోగా బన్నీ… తన 'పుష్ప' 'ఐకాన్' సినిమాలు పూర్తి చేస్తాడని అంటున్నారు.సో ఈ విషయంలో బన్నీకి కూడా క్లారిటీ వచ్చేసింది. ఇక క్లారిటీ & కన్ఫర్మేషన్ రావాల్సింది త్రివిక్రమ్ గురించే.ఎన్టీఆర్ సినిమా ఉండటంతో కొత్త సినిమా ప్రారంభించకపోయినా తర్వాత అది ఉందిలే అనుకున్నారు. ఇప్పుడు ఆ సినిమా లేదు. దీంతో మహేష్ సినిమా అంటున్నారు. అయితే దీనిపై బలమైన పుకార్లు రావడం లేదు. అలాగే క్లారిటీ కూడా రావడం లేదు. త్వరలో ప్రకటిస్తాడు అంటున్నారు కానీ ప్రకటించడం లేదు. పక్కాగా ఉండుంటే.. ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమా ప్రకటించిన రోజే దీని ప్రకటనా రావాల్సింది. కాని ప్రకటన రాలేదు. దీంతో ఎవరితో చెయ్యాలో ఏం చెయ్యాలో తెలీక త్రివిక్రమ్ ఫుల్ డిస్టర్బ్ గా వున్నాడట...