వైరల్ పిక్ : పవన్ కళ్యాణ్ ను హాగ్ చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్..!!

Suma Kallamadi
దాదాపు మూడు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో మన అందరి ముందుకు వచ్చారు. వచ్చి రావడంతోనే ఒక పెద్ద హిట్ సినిమాతో అభిమానులను ఖుషి చేసాడు.పవన్ కళ్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' మూవీ సూపర్ సక్సెస్ తో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. వకీల్ సాబ్ సినిమా రిలీజ్ అయిన మొదటిరోజు నుండే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ఈ సినిమాకు  అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా నీరాజనాలు పలుకుతున్నారు ప్రేక్షకులు. ఒక వైపు కరోనా సెకండ్ వేవ్  వ్యాప్తి చెందుతుండటంతో ఈ వకీల్ సాబ్ సినిమాకు కొంచం మైనస్ అనే చెప్పాలి. కరోనా కారణంగా ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడానికి చాలా భయపడుతున్నారు.


కానీ వకీల్ సాబ్ సినిమా విషయంలో అందరి ఆలోచనలు తారుమారు అయ్యాయి.పవన్ కళ్యాణ్ సినిమా అనే ఒక్క కారణం మాత్రమే కాకుండా సినిమాలో కంటెంట్ కూడా సూపర్ గా ఉండడంతో  కరోనా కూడా జనాలను ఆపలేదని ప్రూవ్ అయింది.అలాగే ఈ సినిమా గొప్ప  విజయం సాధించడంతో ప్రతి ఒక్కరూ కూడా చిత్రబృందాన్ని అభినందించారు.అలాగే పవన్ కళ్యాణ్ ను కూడా పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. వకీల్ సాబ్ కు పోటీగా అందులో లాయర్ నందగా నటించిన ప్రకాష్ రాజ్ సినిమా విడులయ్యాక జరిగిన కొన్ని విషయాలను మీడియాతో షేర్ చేసుకున్నాడు.


అయితే ఇప్పటివరకు ఎవరికి తెలియని విషయాన్ని కూడా  ప్రకాష్ రాజ్ బయటపెట్టాడు. అది ఏంటంటే.. వకీల్ సాబ్ సినిమా చూసాక యంగ్ టైగర్ ఎన్టీఆర్ వచ్చి పవన్ కళ్యాణ్ ను ఆలింగనం చేసుకున్నాడనే విషయాన్నీ ప్రకాష్ బయటపెట్టినట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ పిక్ కూడా వైరల్ అవుతుంది.వీళ్ళ హాగ్ చూసి ఇరువర్గాల అభిమానులు కూడా సంతోష పడుతున్నారు.  మొత్తానికి అందరి స్టార్స్ తో సహా ప్రతి ఒక్కరూ వకీల్ సాబ్ పై అభినందనలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతోంది.వకీల్ సాబ్ సినిమా నిజంగానే పవన్ కళ్యాణ్ కెరీర్ లో "ది బెస్ట్ మూవీ" గా నిలిచిపోతుంది.. !!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: