నోరుజారి అవకాశాలు కోల్పోయిన నటులు..?

Divya

నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్న సామెత సినీ ఇండస్ట్రీకి కూడా వర్తిస్తుందని, కొన్ని సంఘటనలు చూస్తే మనకు అర్థమవుతుంది. అప్పటి వరకు స్టార్ నటులుగా కొనసాగిన కొందరు చిన్న చిన్న మాటల వల్ల నోరు జారడంతో,  సినిమాల్లో అవకాశాలు లేకుండా పోయాయి. అలా వాళ్ల కెరీర్  కూడా ఇబ్బందిగా మారింది . అంతలా జీవితంలో కష్టాలను ఎదుర్కొన్న నటుల గురించి తెలుసుకుందాం.

1). రోజా: సినిమాల్లోకి వచ్చిన కొత్తలో రోజా తమిళ్ ఇండస్ట్రీలో చేతినిండా అవకాశాలు ఉండేవి. ఒకానొక సందర్భంలో ఆమె కమల్ హాసన్ పై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో రోజాకు తమిళంలో సినిమాలు రాకుండా పోయాయి.

2). జమున: అలనాటి స్టార్ హీరోయిన్ జమున గురించి ఇప్పుడున్న కొందరికి మాత్రమే తెలుసు. ఆమె ఏఎన్నార్ పై సంచలన కామెంట్ చేశారు. దీంతో ఆమెకు సినిమాల్లో అవకాశాలు రాకుండా ఏఎన్నార్ చేశాడంటూ జమునే చెప్పారు.

3). నరసింహ రాజు: స్టార్ హీరో నరసింహ రాజు.. ఏయన్నార్ ,ఎన్టీఆర్ లపై సంచలన కామెంట్ చేయడంతో దాంతో ఈయనకు కూడా సినిమా అవకాశాలు చాలా తగ్గాయి.

4). వడివేలు: తమిళంలో స్టార్ కమెడియన్ గా కొనసాగుతున్న వడి వేలు ఎన్నికల ప్రచారంలో జయలలితపై కామెంట్లు చేశారు. దీంతో ఆయనకు సినిమా అవకాశాలు చాలా తగ్గాయి.

5). కోవై సరళ: తెలుగు, తమిళ ఇండస్ట్రీ లో మంచి పేరు తెచ్చుకున్న కోవై సరళ,  తనలా టాలెంట్ ఉన్న వాళ్లకు తమిళ ఇండస్ట్రీ ఎనగంటి ఇవ్వాలంటూ కామెంట్ చేశారు. దీంతో ఆమెను పక్కకు నెట్టేశారు.

6). వాణిశ్రీ: ప్రపంచ తెలుగు మహాసభలో వాణిశ్రీ చేసిన కామెంట్లతో ఆమె సినీ ఇండస్ట్రీకి రాకుండా చేశారు.

7). హేమ: ఆర్టిస్టుగా మంచి పేరు తెచ్చుకున్న హేమ చాలా సినిమాలలో నటించింది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ  అసోసియేషన్ లో సభ్యురాలిగా కూడా పనిచేసింది. అయితే రాజేంద్ర ప్రసాద్, నాగబాబుపై ఆమె ఒక విషయంలో కామెంట్ చేసింది. దీంతో ఆమె కి కూడా ఛాన్స్ మిస్ అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: