బిగ్ బాస్ అఖిల్ ని మళ్ళీ ట్రోల్ల్స్ తో ఆడుకుంటున్న నెటిజన్స్....

Purushottham Vinay
బిగ్ బాస్ సీజన్ 4 ద్వారా పాపులరిటీ తెచ్చుకున్నాడు అఖిల్ సార్ధక్. ఆ సీజన్ లో అఖిల్ పై అభిజిత్ వేసిన పంచ్ డైలాగులు, కౌంటర్లు ఇంకా సెటైర్లు అప్పుడు ఒక రేంజ్ లో ట్రెండ్ అయ్యాయి. ఇక అఖిల్ ని కూడా నెటిజన్స్ ఓ రేంజ్ లో ట్రోల్ చేసి ఆడుకున్న సంగతి తెలిసిందే. అలా ట్రోల్ల్స్ తో పాపులరిటీ దక్కించుకొని ఫైనల్ గా బిగ్ బాస్ 4 కి రన్నర్ గా నిలిచాడు అఖిల్. ఇక బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చాక కొన్ని అవకాశాలు కూడా దక్కించుకుంటున్నాడు.ఇక అఖిల్ మోనాల్ తో కలిసి ఓ వెబ్ సిరీస్ చేసేందుకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తెలుగబ్బాయి.. గుజరాత్ అమ్మాయి అంటూ బిగ్ బాస్ షోలో కుదిరిన మ్యాజిక్‌ను మళ్లీ తెరపై చూపించేందుకు రెడీ అయ్యారు.


అయితే తాజాగా అఖిల్ తన కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలను కూడా తెలిపాడు.ఇక్కడే అఖిల్ కి పెద్ద సమస్య వచ్చి పడింది. అదేంటంటే అఖిల్ తాజాగా నటిస్తున్న ప్రాజెక్ట్ లో తనకు తానే స్టార్ బాయ్ అనే బిరుదు ఇచ్చుకున్నాడు. స్టార్ బాయ్ పేరిట తన కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన అప్డేట్‌ను ఇచ్చాడు. హీరోగా మొదటి చిత్రమంటూ ఫుల్ ఎగ్జైట్ అయిన అఖిల్ ఉగాది సందర్భంగా ఫస్ట్ లుక్ రాబోతోందని  ప్రకటించాడు. చెప్పినట్టుగానే నేడు ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశాడు.ఇక ట్రోలర్స్ కి ఫుల్ స్టఫ్ గా మారాడు. తిప్పికొడితే ఒక్క సినిమా కూడా చెయ్యలేదు నువ్వు స్టార్ బాయ్ వి ఏంటని ట్రోల్ చేస్తున్నారు.ఈ విధంగా అఖిల్ మళ్ళీ నెటిజన్స్ చేతిలో బలి అయిపోతున్నాడు. మరి ఈ ట్రోల్ల్స్ కి అఖిల్ ఎలా స్పందిస్తాడో చూడాలి. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: