అలాంటి పాత్రలంటే నాకు చాలా ఇష్టం : రష్మిక మందన్న
అయితే కేవలం సినిమాల ద్వారా మాత్రమే కాకుండా అటు సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. తన చిలిపి నవ్వుతోనే ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. అయితే ఇప్పటివరకూ ఎక్కడా అందాల ఆరబోత మాత్రం చేయలేదు. కేవలం ట్రెడిషనల్ లుక్ తోనే స్టార్ హీరోయిన్ రేంజికి ఎదిగింది. ఏకంగా మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుని స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలకు కేరాఫ్ అడ్రస్గా మారింది రష్మిక మందన. సాధారణంగా హీరోయిన్లు చిత్రపరిశ్రమలో ఎన్ని సినిమాలు చేసినప్పటికీ ప్రత్యేకంగా కొన్ని రకాల పాత్రలు చేయాలని ఇష్టపడుతూ ఉంటారు.
అటు రష్మిక మందన కు కూడా ఇలాంటి ఒక కోరిక ఉంది అన్నది తెలుస్తుంది. ఇటీవల ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంది ఈ అమ్మడు. విభిన్నమైన పాత్రలు చేయడం తనకు ఎంతో ఇష్టం అంటూ చెప్పుకొచ్చింది. ఒకే రకమైన కథల్లో నటించడానికి అస్సలు ఇష్టపడనని.. నా నటన గురించి ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి ఎప్పుడు ఇష్టపడుతూ ఉంటాను అంటూ చెప్పుకొచ్చింది రష్మిక మందన. అందుకే తన కెరీర్లో అన్నీ వైవిధ్యమైన పాత్రలను చేస్తున్నానని.. ప్రేక్షకులను మెప్పించడం అంత ఈజీ ఏమీ కాదు అంటూ రష్మిక మందన్న చెప్పుకొచ్చింది. ప్రస్తుతం వరుస సినిమాలతో ఈ అమ్మడు బిజీబిజీగా ఉంది.