ఆర్ ఆర్ ఆర్ మితిమీరిన ఆత్మవిశ్వాసం పై చర్చలు !
దీనికి తగ్గట్టుగానే ఈమూవీ పై బయ్యర్లలో మ్యానియా విపరీతంగా పెరిగిపోవడంతో ఈ మూవీ విడుదల కాకుండానే 450 కోట్ల నికర లాభం ఆర్జించింది అంటూ సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్న వార్తలను చూసి ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. సాధారణంగా ఒక సినిమా సూపర్ హిట్ అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఆ మూవీ నిర్మాతలకు 20 కోట్లు లాభం రావడం చాల కష్టమైన పని.
ఈ సినిమాకు నాన్ థియేటర్ హక్కులు డిజిటల్ హక్కులను టోకున 400 కోట్లకు కాస్త ఇటు అటుగా ఇప్పటికే విక్రయించేసారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. వీటితో పాటు ఈ మూవీని డబ్ చేసి ప్రపంచంలోని అనేక భాషలలో విడుదల చేయబోతున్నారు. ఈమూవీకి ఉన్న క్రేజ్ రీత్యా ఈ మూవీ ఓవర్సీస్ రైట్స్ కూడ వందల కోట్లలలో అమ్మకం జరుగుతున్నట్లు టాక్. ఇలా ఈమూవీకి సంబంధించిన బిజినెస్ ను లెక్కలోకి తీసుకుంటే సుమారు 8 వందల కోట్ల వరకు ఉంటుంది అని అంటున్నారు.
దీనితో ఈసినిమాకు అన్ని ఖర్చులు పోను హీరోలు ఇధ్దరికి చెరో 35 కోట్ల పారితోషికాలు ఇతర నటీనటులకు ఇచ్చే పారితోషికాలు టెక్నిషియన్స్ కు ఇచ్చే పారితోషికాలు అదనపు ఖర్చులు వడ్డీలు అన్నీ కలుపుకున్నా ఈమూవీ దర్శక నిర్మాతలు ఇద్దరికీ చెరో రెండు వందల కోట్లు మిగులుతాయి అంటూ లేటెస్ట్ గా సోషల్ మీడియాలో మొదలైన ప్రచారం దేనికి సంకేతం అంటూ ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ ఫిగర్స్ అన్నీ వినడానికి చాల బాగున్నా ఈ మూవీ నిర్మాతల మితిమీరిన ఆత్మ విశ్వాసాన్ని సూచిస్తోంది అంటూ కొందరు ఇండస్ట్రీ ప్రముఖులు కామెంట్స్ చేస్తున్నారు..