వకీల్ సాబ్ టేకింగ్ తో ఫిదా అయిన దిల్ రాజు.. దర్శకుడికి మరో ఆఫర్..?
ఇంకేముంది రెండు హిట్ సినిమాలు తీసినప్పటికీ రాని క్రేజ్ కేవలం పవన్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు అని తెలియగానే వచ్చేసింది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎక్కడ చూసినా వేణు శ్రీరామ్ పేరు మార్మోగిపోతోంది. ప్రస్తుతం నిర్మాతలు అందరి చూపు కూడా వేణు శ్రీరామ్ పైకి వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే వేణు శ్రీరామ్ కు వరుసగా అవకాశాలు కూడా వచ్చి పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే వకీల్ సాబ్ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న దిల్రాజు ఇక వకీల్ సాబ్ సినిమా వేణు శ్రీరామ్ ఎంతో అద్భుతంగా.. తెరకెక్కించారు అని భరోసాతో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే దిల్రాజు వేణు శ్రీ రామ్ కి మరో అవకాశం ఇచ్చేందుకు సిద్ధం అయినట్లు ప్రస్తుతం టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది. వకీల్ సాబ్ సినిమాని బాగా తెరకెక్కించడంలో ఇక వేణు శ్రీరామ్ కు తన బ్యానర్ లోనే మరో సినిమా చేసేందుకు అవకాశం ఇస్తున్నట్లు సమాచారం. అయితే ఇది దర్శకుడు వేణు శ్రీరామ్ అభిమానులందరికీ గుడ్ న్యూస్ అని చెప్పాలి అయితే ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా విజయంపై అటు వేణు శ్రీరామ్ కెరియర్ కూడా ఆధారపడి ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఒకవేళ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తున్న వకీల్ సబ్ సినిమా హిట్ అయింది అంటే మాత్రం ఇక వేణు శ్రీరామ్ కి టాలీవుడ్ లో తిరుగు ఉండదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అని అంటున్నారు విశ్లేషకులు.