మహేష్, త్రివిక్రమ్ మూవీ అనౌన్స్ మెంట్ డేట్ ఫిక్స్.....??

GVK Writings
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికే వరుసగా మూడు సినిమాల ద్వారా హ్యాట్రిక్ విజయాలు అందుకుని ప్రస్తుతం మంచి జోష్ మీద ఉన్న విషయం తెలిసిందే. ఆయన తాజాగా నటిస్తున్న సినిమా సర్కారు వారి పాట. పరశురామ్ పెట్ల దర్శకత్వంలో మంచి మెసేజ్ లతో కూడిన మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్, జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థలపై నిర్మితమవుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు ఒక ఫైనాన్షియర్ గా కనిపించనున్నారని అంటున్నారు.

ఇక ఇటీవల తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ అతి త్వరలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగనున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఈ సినిమా తర్వాత దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కె.ఎల్ నారాయణ నిర్మాతగా రాజమౌళి దర్శకత్వంలో ఒక భారీ పాన్ ఇండియా సినిమా మహేష్ బాబు చేయాల్సి ఉంది. అయితే అది ప్రారంభం కావటానికి చాలా సమయం ఉండటంతో మధ్యలో ఈ లోపు మరో సినిమా చేసేందుకు మహేష్ బాబు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల ఆయన సరిలేరు నీకెవ్వరు దర్శకుడు అనిల్ రావిపూడి తో మరో సినిమా చేయనున్నారు అంటూ వార్తలు ప్రసారమయ్యాయి.

కాగా దానిపై ఇంతవరకు ఎక్కడా కూడా అధికారికంగా న్యూస్ బయటకు రాలేదు. ఇక లేటెస్ట్ గా టాలీవుడ్ వర్గాల్లో వైరల్ అవుతున్న న్యూస్ ను బట్టి రెండు రోజుల క్రితం త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పిన ఒక అద్భుతమైన స్టోరీకి పచ్చజెండా ఊపిన మహేష్ బాబు సర్కారు వారి పాట అనంతరం ఆ మూవీని చేయనున్నారని అంటున్నారు. ఇప్పటికే త్రివిక్రమ్ ఆ స్టొరీ యొక్క పూర్తి స్క్రిప్ట్ పై తన బృందంతో కలిసి కసరత్తు మొదలు పెట్టారని ఉగాది పండుగ నాడు ఆ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా రానుందని అంటున్నారు. మరి ఇదే కనుక నిజమైతే ఎప్పటినుండో మహేష్, త్రివిక్రమ్ కాంబో మూవీ కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకాభిమానులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పక తప్పదు......!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: