మళ్లీ అతనితోనే అవికా గౌర్ సినిమా చేయనుందా...?

VAMSI
చిన్నారి పెళ్లి కూతురిగా బుల్లితెరపై పరిచయమైన బాలీవుడ్ అమ్మాయి అవికా గోర్... ఆ తర్వాత ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది. ఈ చిత్రంలో తన అందంతో అమాయకమైన అభినయంతో యూత్ గుండెల్లో ఉయ్యాలా జంపాలా అంటూ ఊయలలూగింది. బాల నటిగా పరిచయమై ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ఈ భామ మొదటి సినిమా తోనే అద్భుతమైన సక్సెస్ ను సొంతం చేసుకుంది... ఆ తర్వాత హీరోయిన్‌గా తన అంద చందాలతో అటు తెలుగు, మళయాళం, తమిళ భాషల్లో అవకాశాలు దక్కించుకుంది.

తెలుగులో ఈ సినిమా తరువాత వరుస అవకాశాలు అందుకుంది.   'సినిమా చూపిస్త మావా' .. ' ఎక్కడికి పోతావు చిన్నవాడా', లక్ష్మీబాయి మా ఇంటికి, చిత్రాలు ఈమె క్రేజ్ ను అమాంతం పెంచేశాయి. ఇటు యూత్  అటు ఫ్యామిలీ ఆడియన్స్  అవికకు బిగ్ ఫాన్స్ గా మారిపోయారు. అలా టాలీవుడ్ లో ఫుల్ ఫామ్ లో వుండగానే ఈమె తెలుగు సినిమాలకు దూరమైంది...దాంతో తెలుగు ఆడియన్స్ ఈమె పేరు మర్చిపోయారు. కొంత కాలం తర్వాత తిరిగి రాజుగారు గది 3 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చినా, గతంలో  ఉన్నంత హైప్ ను తెచ్చుకోలేకపోయింది. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కపెట్టుకోవాలి, లేదంటే ఇలానే అవుతుందన్న విమర్శలు సైతం వినిపించాయి.

అయితే ఇప్పుడు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది అవిక. చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ చేయనున్న ఓ ప్రాజెక్ట్ లో కథానాయికగా అవికా చేయనుంది. ఇక మరో సినిమాను రాజ్ తరుణ్ తో ఫిక్స్ అయిందట. తాజాగా తన ఫాలోవర్స్ తో చాటింగ్ చేస్తూ రాజ్ తరుణ్ ఈ విషయం చెప్పాడు. అవికా తన బెస్ట్ ఫ్రెండ్ అనీ .. త్వరలోనే ఆమెతో ఒక సినిమా ఉంటుందని అన్నాడు. సో వీరు ముచ్చటగా మూడో ప్రాజెక్ట్ చేయబోతున్నారన్న మాట.ఇలా మళ్లీ టాలీవుడ్ లో బిజీ అవుతోంది అవిక గౌర్. మరి ఈ సినిమా అయినా మళ్ళీ ఈమెను టాలీవుడ్ లో నిలబడుతుందా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: