"కలర్ ఫోటో" మూవీ దర్శకుడికి బంపర్ ఆఫర్...?
టాలెంట్ ఉంటే చాలు నూతన దర్శకులు అయినా సరే పిలిచి మరీ అవకాశాలు ఇస్తున్నారు మన బడా హీరోలు...ఇప్పుడు ఇదే తరహాలో మరో స్టార్ హీరో ఓ యువ దర్శకుడికి చాన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అందులోనూ బడా బిగ్ బ్యానర్ పై కావడం విశేషం. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరంటే సందీప్ రాజ్. మొదట చిత్రం ‘కలర్ ఫోటో’ తోనే అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించి అందరి దృష్టిని ఆకర్షించిన డైరెక్టర్ సందీప్, ఇప్పుడు గీతా ఆర్ట్స్ నుంచి పిలుపు అందుకున్నాడు. ఇప్పటికే సందీప్ రాజ్‌కి గీత ఆర్ట్స్ వాళ్లు అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేశారట.
అందులోనూ ఈ ప్రాజెక్ట్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో కలసి తెరక్కించబోతున్నట్లు వినికిడి. స్వయంగా బన్నీనే సందీప్ ని పిలిచి మరీ ఈ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ గీత ఆర్ట్స్ వరకు కరెక్టే కానీ అల్లు అర్జున్ తో అనేది డౌట్ అంటున్నారు మరికొందరు..మరో వైపు దర్శకుడు సందీప్ చెప్పిన కథ బాగా నచ్చడంతో బన్నీ ఈ అవకాశం ఇచ్చింది నిజమే అంటున్నారు. మరి వీరు పెదవి విప్పితే కానీ అసలు విషయం తెలియదు. అయితే గీత ఆర్ట్స్ లో మాత్రం చోటు దక్కించుకున్నాడు డైరెక్టర్ సందీప్ ఈ ప్రాజెక్ట్ కనుక సక్సెస్ అయితే సందీప్ రాజ్ ఇక వెనుతిరిగి చూడాల్సిన అవసరం ఉండదు.