ఆ విషయం లో సుధీర్ ను అడ్డంగా ఇరికించిన నాని..

frame ఆ విషయం లో సుధీర్ ను అడ్డంగా ఇరికించిన నాని..

Satvika
పండగలు వస్తున్నాయంటే చాలు బుల్లి తెర నటులు జనాలను ఆకట్టుకోవడానికి తెగ ప్రయత్నిస్తారు. ప్రతి పండగకు బుల్లి తెరపై ఏదోక షో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే.. ఈ ఉగాదికి కూడా ఒక్కో ఛానెల్ ఒక్కో విధంగా ఆకట్టుకుంటుంది. ప్రేక్షకులను మెప్పించేందుకు తమ శైలిలో దూసుకువస్తున్నాయి. ఈటీవీ, స్టార్ మా, జీ తెలుగు వాళ్లంతా కూడా ఉగాది ఈవెంట్ ప్రోమో లను ప్రసారం చేస్తూ జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.


ఉగాది జాతి రత్నాలు అంటూ ఈటీవీలో స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఇందులో సుధీర్, శ్రీముఖి, పూర్ణ, సంగీత, రష్మీ ఇలా అందరూ రచ్చ చేసేందుకు రెడీ అయ్యారు. వీరితో పాటు మనో, హైపర్ ఆది ఇలా జబర్దస్త్ టీం అంతా కూడా రెడీ అయింది.ఉగాది అంటేనే షడ్రుచుల సమ్మేళనం అంటూ ఆరు రకాల గురించి చెప్పుకొచ్చారు. ఇందులో కమెడియన్స్, యాక్టర్స్, యాంకర్స్, డ్యాన్సర్స్, సోషల్ మీడియా స్టార్స్ అంటూ అందరి గురించి చెప్పుకొచ్చారు. అయితే ఇందులో ఒక్కొక్కరిని ఒక్కో రుచితో పోల్చారు.


షో మొదట్లోనే గొడవలతో మొదలు పెట్టారు.నాచురల్ స్టార్ నాని ఈ ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్‌గా వచ్చాడు. టక్ జగదీష్ ప్రమోషన్స్‌లో భాగంగా నాని ఉగాది జాతిరత్నాలు ఈవెంట్‌లో దుమ్ములేపేశాడు. అయితే ఈవెంట్‌లో భాగంగా సుడిగాలి సుధీర్‌ను ఓ రేంజ్‌లొ ఆడుకున్నారు.సుధీర్‌ను నాని వద్ద హైపర్ ఆది ఇరికించేశాడు. వేప ఆకులను తినాలని, అది తింటే నాని టక్ జగదీష్ సినిమా హిట్ అవుతుందని ఆది అన్నాడు.. అలా ఆది వేసిన కౌంటర్ కు నాని కూడా తోడయ్యాడు.. దీంతో సుధీర్ అడ్డంగా దొరికిపోయాడు. శ్యాం సింఘరాయ్ షూటింగ్ అవ్వాలని, దాని ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా సక్సెస్ అవ్వాలని.. అందుకే నువ్ ఇవ్వన్నీ తినాలని ఆది మళ్లీ ఇరికించాడు. ఇక నాని సైతం సుధీర్‌ను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేశాడు... మొత్తానికి ఈ షో లో హీరో నాని కూడా హైలెట్ అయ్యారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: