RC15 కి దిల్ రాజు లెక్కలు ఎలా ఉన్నాయంటే....

Purushottham Vinay
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం "ఆచార్య","ఆర్ ఆర్ ఆర్ " సినిమాలు చేస్తున్నాడు. ఇక ఇవి అయ్యాక శంకర్ తో 15 వ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమా దిల్ రాజు తన బ్యానర్‌లో చేస్తున్న 50వ సినిమా కావడంతో దిల్‌ రాజు ఈ సినిమా కోసం గట్టిగానే ప్లాన్‌ చేస్తున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించి హీరో, దర్శకుడు ఓకే అయిపోవడంతో చిత్రబృందం ఎంపిక పనుల్లో ఉన్నాడట. హీరోయిన్‌ ఆమె, ఈమె అంటూ వార్తలొస్తున్నాయి. టెక్నికల్‌ టీమ్‌ విషయంలోనూ ఇలానే మాటలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా శంకర్‌, చరణ్‌ పారితోషికాలు ఇవే అంటూ ఓ వార్త కనిపిస్తోంది.ఈ సినిమా కోసం దిల్‌ రాజు ₹150 కోట్లు బడ్జెట్‌గా పెట్టుకున్నాడని సమాచారం అందుతుంది. ఈ విషయం అధికారికంగా ప్రకటించనప్పటికీ అంతే పెడుతున్నాడనే వార్తలైతే గట్టిగా వినిపిస్తున్నాయి.అందులో పూర్తి లెక్కలు ఇవనేది తాజా వార్త.


మొత్తం ₹150 కోట్లలో చరణ్‌, శంకర్‌కు చెరో ₹40-₹50 కోట్లు ఇస్తున్నారట. అంటే వీరిద్దరికే ₹80-₹100 కోట్లు అయిపోయాయి. మిగిలింది ₹50-₹70 కోట్లే. దీంతోనే మిగిలిన పనులన్నీ చూసుకోవాలి. మిగిలిన టీమ్‌కి డబ్బులు ఇవ్వాలి.కాబట్టి అందుకే దిల్ రాజు చాలా జాగ్రత్తగా లెక్కలు వేసుకున్నాడు. శంకర్ సినిమా అంటే మినిమమ్ 100 కోట్లు సినిమా మేకింగ్ కే సరిపోతుంది. కానీ దిల్ రాజు ఎలా లెక్కలతో సరిపెడతాడో చూడాలి. సాధారణంగా చిన్న మీడియం బడ్జెట్ తో తెరెకెక్కించే దిల్ రాజు మొట్టమొదటి సారిగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. మరి ఈ సినిమా దిల్ రాజుకి ఎంతవరకు లాభాలు తీసుకొస్తుందో చూడాలి. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి..ఇంకా మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: