"నాన్నగారి బయోపిక్ తీయాలని ఉంది".. మీడియా ముందు తన మనసులో మాట బయటపెట్టిన నాగార్జున..!!

Anilkumar
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. టాలీవుడ్ సీనియర్ హీరో కింగ్ నాగార్జున నటించిన తాజా చిత్రం 'వైల్డ్ డాగ్'.. నాగ్ సరసన బాలీవుడ్ బ్యూటీ దియా మీర్జా హీరోయిన్‏గా నటించింది. అంతేకాకుండా ఈ సినిమాలో సయామీ ఖేర్  మరియు బిగ్ బాస్ ఫేమ్ అలీ రేజా కీలక పాత్రలో నటించారు.. ఈ సినిమాకి థమన్ సంగీతం అందించాడు.ఇక తాజాగా ఏప్రిల్ 2 న విడుదలైన ఈ సినిమాకి ఆడియన్స్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.. సినిమాలో విజయ్ వర్మ పాత్రలో నాగ్ నటన అధ్బుతంగా ఉందని..అంతేకాదు థమన్ అందించిన నేపధ్య సంగీతం కూడా చాలా బాగుందని అంటున్నారు.. 


ఇక ఈ సినిమాకి ప్రస్తుతం థియేటర్లనుంచి వచ్చిన స్పందన సందర్భంగా సక్సెస్‌మీట్‌లో శనివారం నాగార్జున మాట్లాడారు. ఈ సినిమాకు పడ్డ కృషి ఫలించిందన్నారు. అలాగే అక్కినేని నాగేశ్వరరావుగారి బయోపిక్ గురించి చెబుతూ, నాకూ నాన్నగారి బయోపిక్ చేయాలనుంది. కానీ కొంచెం భయంగా వుంది. ఒక్కోసారి భయంలోంచి మంచి ఆలోచనలు వస్తాయి. తప్పకుండా అన్నీ సమకూరితే చేద్దామని వుంది అని తెలిపారు.అలాగే సినిమాకు ముందు చిరంజీవితో కలిసి చికెన్ తినడంపై మాట్లాడారు, ఆరోజు సాయంత్రం అందరూ ప్రివూ చూడడానికి వెళ్ళారు.


నేనే ఒక్కడినే వున్నా. చిరంజీవిగారు ఫోన్ చేశారు. ఏంచేస్తున్నావ్ అని అడిగారు. అందరూ సినిమా చూడ్డానికి వెళ్ళిపోయారు. నేను ఒక్కడినే వున్నా. అని చెప్పగానే వెంటనే ఆయన.. ఇంటికి రా:. రాజమండ్రి నుంచి చక్కటి చికెన్‌ ఐటం వచ్చింది. అన్నారు. అలా చిరు ఇంటికి వెళ్ళాను. ఆయనే చక్కగా వండి పెట్టారు. తింటూ షూటింగ్ ముచ్చట్ల, షూటింగ్‌లో ఒత్తిడిల గురించి మాట్లాడుకున్నాం అని తెలిపారు..ఇక చివరికి ఈ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేశారు..ఇక ఈ సినిమా తర్వాత గరుడ వేగ దర్శకుడు ప్రవీణ్ సత్తారుతో ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నాగార్జున..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: