శ్రీముఖి చేసిన పనికి షాక్ లో ఎమ్మెల్యే రోజా... ఏం చేసిందంటే..!
అయితే తాజాగా ఈ టీవీలోని మల్లెమాల ఈవెంట్ లో ఓ అనుకోని సంఘటన జరిగింది. జాతిరత్నాలు పేరిట వస్తున్న ఈ స్పెషల్ ఈవెంట్ లో శ్రీముఖి యాంకర్ గా వ్యవహరించింది. అంతేకాదు శ్రీముఖితో కలిసి పూర్ణ కూడా చిందేసింది. అయితే ఈ షో కోసం ప్రత్యేక గెస్ట్ గా జబర్దస్త్ జడ్జ్ మనో రావడం జరిగింది. అయితే మనోకు ఒక అనుకోని బంపర్ ఆఫర్ దక్కింది. ఒక్కసారిగా మనోను ఓ వైపు శ్రీముఖి, మరో వైపు ఢీ జడ్జ్ పూర్ణ ఒకే సారి రెండు బుగ్గలపై ముద్దులు పెట్టగానే, మనో మాస్టారు ఫ్యూజులు ఎగిరిపోయాయి.
ఇక ఈ అనుకోని ఘటనతో ఉగాది ఈవెంట్ జాతిరత్నాలు చాలా సరదాను పుట్టించింది. నిజానికి మల్లెమాల ఈవెంట్ కోసం శ్రీముఖి చాలా కష్టపడిందనే చెప్పాలి. ముఖ్యంగా కరోనా తర్వాత జరిగిన ఈ గ్రాండ్ ఈవెంట్ కోసం శ్రీముఖితో పాటు, జడ్జ్ గా ప్రముఖ యాంకర్ ఉదయభాను కూడా రావడం గమనార్హం. అయితే జబర్దస్త్ జడ్జ్ మనోకు శ్రీముఖి, పూర్ణ నుంచి ముద్దుల సర్ ప్రైజ్ రావడంపై ఎమ్మెల్యే రోజా షాక్ కు గురైనట్లు తెలుస్తోంది. మనో మాస్టారు ఒకప్పటి కన్నా ఇప్పుడు మరింత దూసుకుపోతున్నారని సన్నిహితులతో అన్నట్లు తెలుస్తోంది.