పవన్ కళ్యాణ్ చుట్టూ ఏదో ఒక శక్తి ఉంది అంటున్న ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..?

Divya

పవన్ కళ్యాణ్ అంటేనే విపరీతమైన అభిమానం ప్రేక్షకులలో  మొదలవుతుంది. పవన్ కళ్యాణ్ సినిమాలను వదిలేసి రాజకీయాల్లోకి వెళ్ళినా,  తిరిగి సినిమాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల వకీల్ సాబ్ సినిమా ట్రైలర్ విడుదలైన సందర్భంగా ప్రేక్షకులలో ఎంత మంచి స్పందన వచ్చిందో పెద్దగా చెప్పనవసరం లేదు. మెగా ఫ్యామిలీకి సంబంధించిన పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మెగాస్టార్ తర్వాత అంత క్రేజ్ ను అంతే స్థాయిలో దక్కించుకున్న ఒకే ఒక్క హీరో పవన్ కళ్యాణ్. అయితే పవన్ కళ్యాణ్ గురించి ఒక హీరోయిన్ సంచలన వార్తలు చేసింది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..


పూర్తి వివరాల్లోకి వెళితే ఇస్మార్ట్ శంకర్ సినిమా ద్వారా తెలుగులో సక్సెస్ను సాధించడంతో పాటు మంచి గుర్తింపు పొందిన నిధి అగర్వాల్. ఈమె ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సరసన హరహర వీరమల్లు సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఈ ఇస్మార్ట్ బ్యూటీ, నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. పవర్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ నుంచి తాను చాలా విషయాలు నేర్చుకున్నానని నిధి అగర్వాల్ చెప్పుకొచ్చింది..


ఇక మీడియా సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. "నేను పవన్ కళ్యాణ్ కి చాలా పెద్ద ఫ్యాన్ ని,పవన్ కల్యాణ్ తో కలిసి నటించాలని నా కోరిక ఈ సినిమాతో తీరబోతోంది. అంతేకాదు పవన్ కళ్యాణ్ చాలా అద్భుతమైన నటుడు. పవన్ కళ్యాణ్ తో కలిసి పని చేయడం ఒక గొప్ప అనుభూతిని ఇచ్చింది."  అంటూ ఆమె చెప్పుకొచ్చింది. అంతే కాకుండా పవన్ చుట్టూ ఏదో ఒక శక్తి ఉందని, పవన్ కళ్యాణ్ సెట్ లో అడుగు పెడితే, అందరూ ఆయనని చూస్తూ ఉండిపోతారు అని కూడా ఆమె చెప్పుకొచ్చింది. ఏదైనా సీన్ కోసం రిహార్సల్ చేయాల్సి వస్తే, పవన్ ఎంతో ఆనందంగా చేస్తారని ఆమె తెలిపారు.. హరిహర వీరమల్లు సినిమాలో రాజసం ఉట్టిపడే వస్త్రాల్లో నిధి అగర్వాల్ కనిపించబోతోందని సమాచారం. వెండితెరపై తన పాత్రను చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు ఆమె తెలిపింది. అంతేకాకుండా గత సినిమాల్లోని పాత్రలకు 20 నిమిషాలు టైం పెడితే,  ఈ సినిమాలోని పాత్ర కోసం 90 నిమిషాల సమయం పడుతుందని ఆమె చెప్పుకొచ్చింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: