వకీల్ సాబ్ ట్రైలర్ లో మా హీరోయిన్ ఎక్కడా అంటున్న అభిమానులు.. !
హీరోయిన్ ను కనీసం ఒక్క షాట్ లో కూడా చూపించకపోవడం ఏమి బాగోలేదు అని శృతి హాసన్ అభిమానులు తెగ ఫీల్ అయిపోతున్నారు.ఒకసారి ట్రైలర్ చూస్తే నివేదా థామస్, అంజలి, అనన్య ఇలా ఈ ముగ్గురు ఆడవాళ్ళని మాత్రమే అంత సేపు చూపించారు కానీ మైన్ హీరోయిన్ ను దాచేశారు అంటూ అభిమానులు మండి పడుతున్నారు. ఇది ఇలా ఉంటే మరో వైపు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రంగంలోకి దిగి ఆ కామెంట్స్ ని పక్కకు తోస్తున్నారు. ఈ సినిమాలో శృతి హాసన్ క్యారెక్టర్ రివీల్ కాకూడదనే ఉద్దేశంతోనే ఆమెను ట్రైలర్లో చూపించలేదేమో.. అలా ఎందుకు ఆలోచించరు అని అంటున్నారు.
అంతేకాదు అవకాశాలు లేని సమయంలో శృతి హాసన్ కి పవన్ అద్భుతమైన ఆఫర్ ఇచ్చాడు..ఆ విషయం మరచిపోకూడదు మీరు అంటూ అభిమానులు తిరిగి పోస్టులు పెడుతున్నారు.నిజానికి వకీల్ సాబ్ సినిమాలో శృతి హాసన్ క్యారెక్టర్ చాలా తక్కువ నిడివితో ఉంటుందట. కానీ మన తెలుగు ప్రేక్షకుల కోసం ఈ సినిమాలో హీరోయిన్ పాత్రను ఇంకాస్త పెంచినట్లు తెలుస్తోంది. ట్రైలర్ లో శృతిని చూపించకపోయినా సినిమాలో మాత్రం ఆమె పాత్ర చాలా బాగుంటుందని.. కచ్చితంగా మంచి పేరు వస్తుంది అంటూ చిత్ర యూనిట్ చెబుతున్నారు. ఈ ఏడాది మొదటిలోనే శృతి హాసన్ క్రాక్ సినిమాతో మంచి హిట్ అందుకుంది. మరి వకీల్ సాబ్ సినిమాతో కూడా ఆ హిట్ ని కంటిన్యూ చేస్తుందో లేదో చూడాలి.. !!