ప్లానింగ్ వర్కౌట్ అయితే .... బాక్సాఫీస్ సునామీనే .....??
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ తో కలిసి ఈ మూవీ ని అత్యధిక వ్యయంతో నిర్మిస్తున్నారు. హిందీలో రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకున్న పింక్ మూవీ కి రీమేక్ గా వకీల్ సాబ్ రూపొందుతోంది. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్ని కూడా సినిమాపై ఇప్పటివరకు ఉన్న అంచనాలు అమాంతం ఒక్కసారిగా పెంచేసాయి. పవన్ కళ్యాణ్ ఇందులో లాయర్ సత్యదేవ్ అనే పాత్ర చేస్తుండగా ఇతర పాత్రల్లో ప్రకాష్ రాజ్, అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ళ తదితరులు నటిస్తున్నారు. ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ ఈ మూవీ తప్పకుండా బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టి ఆయనకు మంచి బ్రేక్ ఇవ్వడం ఖాయం అని భావిస్తున్నారు.
ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా రిలీజ్ ని నిర్మాత దిల్ రాజు ఎంతో భారీ లెవెల్లో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ స్థాయిలో బెనిఫిట్ షో లు నిర్వహించేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని, అలానే ఓవర్సీస్ లో కూడా ఈ మూవీని గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయనున్నారని అంటున్నారు. తొలి షో నుండి మంచి టాక్ వస్తే తప్పకుండా పవర్ స్టార్ ఈ వకీల్ సాబ్ ద్వారా బాక్సాఫీస్ సునామి సృష్టించడం ఖాయం అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరి ఈ మూవీ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరొక పది రోజులు వెయిట్ చేయాలి.....!!