టాలీవుడ్ గాసిప్స్: ఫిదా మూవీ లో నటించిన ఈయన ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుసా..?
టాలీవుడ్ మూవీ లో నటించిన సాయి చంద్ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ ఫిదా మూవీ సాయిచంద్ అంటే టక్కున గుర్తు పట్టేస్తారు. ఫిదా సినిమాలో సాయి పల్లవి తండ్రి పాత్రలో అదరగొట్టేసారు సాయి చంద్. చాలా ఏళ్ల తర్వాత ఆ సినిమా చేసి ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నారు. అలా అని ఏది పడితే అది చేయడం లేదు. ప్రతి సినిమా భిన్నంగా ఉండేలా చూసుకుంటున్నారు. అంతలా సినిమా పట్ల అభిమానం చూపించే సాయిచంద్ పెళ్లి చేసుకోలేదని తెలుసా? దానికి కారణం చెప్పుకొచ్చారాయన.
సాయి చంద్ వాళ్ళ అమ్మ చనిపోయిన తరువాత చాలా రోజులు బాధ పడ్డాడట. చిన్నప్పుడు 'సతీ అరుంధతి, లో నటించారాయన. ఆ సమయంలో జమున గారిని చూసి 'అమ్మా !నన్ను విడిచి వెళ్లి పోతున్నావా!'అనే డైలాగ్ చెప్పాలట. ఆ సీన్ చేసేటప్పుడు చాలా బాధకు గురై, వాళ్ళ అమ్మ గుర్తుకు వచ్చి , జమున గారి చేతుల పైన పడి బోరుమంటూ ఏడ్చాడట. 'మంచుపల్లకి'లోనూ తల్లి లేకుండా తండ్రి పెంపకంలో పెరిగిన యువకుడి పాత్ర చేశారు సాయిచంద్.
ఆ సినిమాలో ఓ సన్నివేశంలో తండ్రి పైన కోపం తో బయటికి వచ్చి బైక్ మీద హీరోయిన్ సుహాసిని చుట్టూ రౌండ్ కొడుతూ ఉంటారు ఆయన. ఆ సీన్ లో సుహాసిని వచ్చి ఆపి. ఎందుకలా చేస్తున్నావ్ అని అడిగితే... 'అమ్మ గుర్తుకొస్తోంది' అని చెప్పే సీన్ ఉంటుందట. అయితే ఆ సన్నివేశాన్ని షూట్ చేసేటప్పుడు కూడా ఆయనకి కన్నీళ్లు వచ్చాయట.ఆ బాధల్ని మర్చిపోవాలని ఎవరైనా మహిళ ఆయన మీద ఆత్మీయత చూపిస్తే అమ్మ ,అక్క ,చెల్లి అంటూ వరసలు కలిపేస్తాడట. మహిళల్ని అలా తప్ప మరో విధంగా చూడలేకపోవడం వల్ల ఆయన పెళ్లి చేసుకో లేదంటు చెప్పుకొచ్చాడు ఆయన. సాయి చంద్ తన తల్లి లేని లోటును ఎవరు తీర్చలేరు అంటే కనిపించిన ప్రతి ఒక్క అమ్మాయి లో తన తల్లిని చెల్లిని అక్కని చూసుకుంటూ ఉన్నాడట. ఆ కారణం చేతనే పెళ్లి చేసుకోలేక పోయాడు..