సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ లో ఆగిపోయిన సినిమాలు ఎన్నో తెలుసా..!

N.ANJI
తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో ఎన్నో మంది ప్రేక్షకుల అభిమానాన్ని పొందాడు. కృష్ణ ఎప్పటికప్పుడు విభిన్న, వైవిధ్యమైన చిత్రాలు నిర్మిస్తూ పరిశ్రమలో కొత్త టెక్నాలజీ తెచ్చి,మార్గదర్శకంగా నిలిచాడు. మంచితనం సరేసరి. తన రెమ్యునరేషన్ పూర్తిగా ఇవ్వకపోయినా సరే, సినిమా రిలీజ్ అయితే చాలనుకునేవారు. అంతేకాదు,నిర్మాత నష్టపోతే తాను నష్టపోయినట్లు ఫీలయ్యేవారు. అయితే నిర్మాతల ప్లానింగ్ లోపం వలన కృష్ణ సినిమాలు కొన్ని ఆగిపోయాయి.

ఇక డైరెక్టర్ పి చంద్రశేఖర్ రెడ్డి ,కృష్ణ కాంబినేషన్ లో పసిడి పంటలు మూవీ భానుప్రియ హీరోయిన్ గా మొదలైంది. సత్యనారాయణ వంటి నటులు నటించిన ఈ మూవీ షూటింగ్ పూర్తయి, ఫస్ట్ కాపీ వచ్చాక ,నిర్మాతల్లో ఒకరు చనిపోవడంతో సినిమా రిలీజ్ ఆగింది. ఆతర్వాత రిలీజ్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇక దుర్గా నాగేశ్వరరావు డైరెక్షన్ లో కృష్ణ హీరోగా ప్రతాప రుద్రుడు మూవీ 1990లో మొదలైంది. వెంకటేశ్వర రెడ్డి కొత్త నిర్మాత. రాధ హీరోయిన్. రెండు షెడ్యూల్ అయ్యాక ఆర్ధిక కారణాలతో ఆగిపోయింది.

అయితే దర్శకుడు శివనాగేశ్వరరావు 1995లో కృష్ణతో అదరహో మూవీ ప్రారంభించారు. రంభ హీరోయిన్. 2సాంగ్స్ మినహా మూవీ పూర్తయింది. అదే సమయంలో సంప్రదాయం మూవీ మొదలవ్వడం అది రిలీజై, ప్లాప్ కావడంతో అదరహో మీద దానిప్రభావం పడింది. దాంతో షూటింగ్ ముందుకి సాగలేదు.

అంతేకాదు.. వారెవ్వా మొగుడా అనే మూవీలో కృష్ణ భార్యగా వినీత, మరదలిగా రుచిత నటించారు. ఒక సాంగ్ మినహా పూర్తయినప్పటికీ కొత్త నిర్మాతలు కావడంతో చేతులెత్తేశారు. ఇక పూరి జగన్నాధ్ తిల్లానా మూవీని కృష్ణతో స్టార్ట్ చేసారు. మూడు సాంగ్స్, కొంత షూటింగ్ జరిగినా నిర్మాత ఆర్ధిక ఇబ్బందులతో ఆగిపోయింది. బొబ్బిలి దొర మూవీ రిలీజ్ కాకుండానే 1996లో ఎమ్మెల్యే మూవీకి బోయపాటి కామేశ్వరరావుకి కృష్ణ ఛాన్స్ ఇచ్చారు. అయితే షూటింగ్ జరుగుతుండగా బొబ్బిలిదొర మూవీ డిజాస్టర్ కావడంతో ప్రొడ్యూసర్ ఆలోచనలో పడ్డాడు. అలా ఆ సినిమా ఆగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: