ఎవరూ ఊహించని రీతిలో మనకు దూరం అయిన ప్రముఖ నటులు ఎవరో తెలుసా..?
సినీ ఇండస్ట్రీ లోకి ఎంతోమంది నటులు వస్తుంటారు వెళుతుంటారు. కానీ అలాంటి వారిలో కొంతమంది మాత్రం వారి నటనతో ప్రేక్షకులను మెప్పించి ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసుకుంటూ ఉంటారు. అలాంటి వారు వెండి తెరపై కనిపిస్తే చాలు నవ్వులు పూస్తాయి. అంతలా వారి నటన ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. అలాంటి ఎంతో మంది నటీ నటులు భౌతికంగా మనకు దూరమైనా, వారి నటన, కామెడీ మాత్రం తెలుగు ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ నిలిచి ఉంటుంది. గత దశాబ్ది కాలంలో టాలీవుడ్ కోల్పోయిన పలువురు నటీనటులు, సినీ ప్రముఖుల వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1).వేదం నాగయ్య:
వేదం సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నాగయ్య. శనివారం కన్నుమూశారు. 30కి పైగా సినిమాల లో నటించాడు.ఈయనది గుంటూరు జిల్లా నరసరావుపేట సమీపంలో దేశవరం పేట గ్రామానికి చెందినవారు.
2). వి దొరస్వామిరాజు:
2021 జనవరి 18 న మరణించాడు. నాగార్జునతో అన్నమయ్య, జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రి లాంటి బ్లాక్ బాస్టర్ సినిమాలను అందించాడు వి దొరస్వామిరాజు.
3). నర్సింగ్ యాదవ్:
2020 డిసెంబర్ 31 న నర్సింగ్ యాదవ్ మరణించారు. ఈయన అసలు పేరు మైలా నరసింహ యాదవ్. విజయనిర్మల దర్శకత్వంలో వచ్చిన హేమ హేమలు చిత్రం ద్వారా ప్రవేశం చేశారు. ఆర్జివి దర్శకత్వంలో వచ్చిన క్షణం క్షణం సినిమాతో నర్సింగ్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన 300కు పైగా సినిమాలలో నటించాడు. కిడ్నీ సమస్య తో 2020 డిసెంబర్ 30న కన్నుమూశారు.
4). జయ ప్రకాష్ రెడ్డి:
2020 డిసెంబర్ 10న ఈయన మరణించారు.రాయలసీమ యాసలో మాట్లాడుతూ సీరియస్ విలనిజం చేయాలన్నా, కామెడీని పండించాలన్నా ఆయన డైలాగులతో కడుపుబ్బా నవ్వించే శక్తి కేవలం జయప్రకాష్ రెడ్డి కి మాత్రమే దక్కింది .దాసరి నారాయణ దర్శకత్వంలో వచ్చిన బ్రహ్మపుత్రుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమాయ్యాడు . ఈయన తన నటనకు గానూ నంది అవార్డు ను కూడా అందుకున్నాడు.
5). ఎస్పీ బాలసుబ్రమణ్యం:
2020 సెప్టెంబర్ 25 న ఈయన మరణించారు.తన గొంతుతో తెలుగు ప్రజల గుండెలను తాకే గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. కరోనా కారణంగా గత ఏడాది సెప్టెంబర్ లో కన్నుమూశారు. ఈయన 40 వేలకు పైగా పాటలు పాడారు.అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి 2001 లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నాడు. ఏపీ ప్రభుత్వం నుంచి 25 భాగాలలో నంది పురస్కారం అందుకున్నాడు.
6). నందమూరి హరికృష్ణ:
2018 ఆగస్టు 29 న మరణించాడు. సీనియర్ ఎన్టీఆర్ తనయుడు నందమూరి హరికృష్ణ నటించిన చిత్రాలు లాహిరి లాహిరి లో, సీతయ్య, శివరామరాజు సినిమాలతో మంచి నటుడిగా మెప్పించారు.
7). శ్రీదేవి:
2018 ఫిబ్రవరి 24 న మరణించింది. భారత సినీ చరిత్రలో అతిలోకసుందరి గా వెలిగిన అందాల తార శ్రీదేవి.
8) దాసరి నారాయణరావు:
2017 మే 30 న ఆయన మరణించాడు.అంతేకాకుండా అత్యధిక చిత్రాల దర్శకుడిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించారు.
అంతేకాకుండా ఆర్తి అగర్వాల్, రామానాయుడు, ఎమ్మెస్ నారాయణ, ఆహుతి ప్రసాద్, చక్రి, బాపు, తెలంగాణ శకుంతల, అక్కినేని నాగేశ్వరరావు, ఉదయ్ కిరణ్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, శ్రీహరి మొదలగు వారు సినీ ఇండస్ట్రీ ని వీడి వెళ్ళిపోయారు.