ఆదిపురుష్ ఫస్ట్ లుక్ ఎప్పుడో తెలిసిపోయింది...!
వీటిలో మూడు చిత్రాలు ఇప్పటికే షూటింగులో ఉన్నాయి. ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన రాధేశ్యామ్ విడుదలకు సిద్ధం అవుతోంది. ఇకపోతే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సలార్ మరియు ఆదిపురుష్ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అయితే మొట్టమొదటి సారిగా పౌరాణిక చిత్రాన్ని చేస్తున్న ప్రభాస్ ఆదిపురుష్ పైనే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమా రామాయణం అనే మహా కావ్యంతో ముడిపడి ఉన్నందున, ఇందులో రాముడి పాత్రలో ప్రభాస్ నటించడం మరొక ఎత్తు. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ మరియు సోగ్గాడు శోభన్ బాబు తర్వాత రాముడి పాత్రను ఎవ్వరూ పోషించింది లేదు. కాబట్టి వారిని మెప్పించగలడా అనే సందేహాలు లేకపోలేదు.
కెరీర్ మంచి పీక్ లో ఉండగా ప్రభాస్ ఇలాంటి పాత్ర పోషించడం పైన పలువురు పెదవి విరుస్తున్నారు. అయితే ఆదిపురుష్ లో ప్రభాస్ రాముడిలా ఎలా ఉండనున్నాడో తెలుసుకోవడానికి ప్రేక్షక లోకమంతా ఎదురుచూస్తోంది. దీనికి ఈ సినిమా మేకర్స్ ఒక గుడ్ న్యూస్ చెప్పారు...అతి త్వరలోనే ఆదిపురుష్ నుండి ప్రభాస్ లుక్ ను రివీల్ చేయనున్నారట. ఏప్రిల్ 21 న శ్రీరామనవమిని పురస్కరించుకుని 'ఆదిపురుష్'లో ప్రభాస్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసేందుకు సిద్దమవుతోందట యూనిట్.