వకీల్ సాబ్ ఫంక్షన్ ను చుట్టుముడుతున్న సమస్యలు !
ఈ మూవీ ఫంక్షన్ ను అత్యంత భారీస్థాయిలో చేయాలని దిల్ రాజ్ ప్లాన్ చేస్తున్నాడు. దీనికితోడు చిరంజీవి పవన్ లు కలసి పాల్గొనబోయే ఈవెంట్ కావడంతో ఈ ఈవెంట్ ను అత్యంత భారీ స్థాయిలో నిర్వహించాలని యాక్షన్ ప్లాన్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ‘వకీల్ సాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవితో పాటు చరణ్ కూడ వస్తున్నట్లు తెలుస్తోంది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ ఫంక్షన్ కోసం కోటి రూపాయలు పైగా ఖర్చు పెట్టడానికి నిర్మాత దిల్ రాజు సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే తెలుగు రాష్ట్రాలలో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్న పరిస్థితులలో ఆ ఫంక్షన్ ఫ్యాన్స్ మధ్యలో జరపడమా లేదంటే ఫ్యాన్స్ లేకుండా పరోక్షంగా నిర్వహించాల అన్న సందిగ్ధంలో ఉనట్లు తెలుస్తోంది. కరోనా సెకండ్ వేవ్ భయాల నేపథ్యంలో ఫ్యాన్స్ తో కలిసి ఫంక్షన్ పెడితే ఫాన్స్ హంగామా మధ్య కొవిడ్ నిబంధనల ఎవరు పట్టిచుకోరు అన్న భయం దిల్ రాజ్ కు ఉన్నట్లు టాక్. దీనితో ఈ ఫంక్షన్ కు సంబంధించి సం గెస్ట్ లు ఖరారు అయినా హోస్ట్ లు డిసైడ్ అయినా ప్రేక్షకుల విషయం తేలేవరకు ఈ మూవీ ఫంక్షన్ విషయంలో ఈ డైలమా కొనసాగుతుంది అంటున్నారు.
ప్రస్తుత పరిస్థితులలో ఈమూవీకి అత్యంత భారీ కలక్షన్స్ రాకుంటే ఈ మూవీ బయ్యర్లు ఇరుకునపడే ఆస్కారం ఉందని దిల్ రాజ్ భయం. దీనికితోడు ఈ సినిమాకు సంబంధించిన ప్రతి ప్రమోషన్ కు పవన్ కళ్యాణ్ వచ్చే ఆస్కారం తక్కువ అని దిల్ రాజ్ భయం అని అంటున్నారు. దీనితో ఈ మూవీకి అత్యంత భారీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేయకుంటే దాని ప్రభావం ‘వకీల్ సాబ్’ ఓపెనింగ్ కలక్షన్స్ పై ఉంటాయని దిల్ రాజ్ తెగ టెన్షన్ పడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి..