పలు సినిమాలలో ఐటమ్ సాంగ్స్ లో నటించిన టాలీవుడ్ హీరోయిన్లు వీళ్ళే..!
1) తమన్నా:
మిల్క్ బ్యూటీ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ హీరోయిన్ బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన అల్లుడు శీను, యష్ కే జి ఎఫ్, మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు వంటి సినిమాలలో ప్రత్యేక పాటలో సందడి చేశారు.
2) శృతిహాసన్:
స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న శృతిహాసన్ మహేష్ బాబు నటించిన ఆగడు సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించారు.
3) పూజా హెగ్డే:
టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఉన్న వారిలో పూజాహెగ్డే ఒకరు.ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ బుట్టబొమ్మ రంగస్థలం సినిమాలో స్పెషల్ సాంగ్ లో సందడి చేశారు.
4) అంజలి:
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ఎంతో వినయంగా నటించిన అంజలి అల్లు అర్జున్ సరైనోడు సినిమాలో ప్రత్యేక పాటలో తన డాన్స్ ద్వారా అదరగొట్టింది.
5) కాజల్ అగర్వాల్:
గత 15 సంవత్సరాల నుంచి టాప్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ ఎన్టీఆర్ నటించిన జనతాగ్యారేజ్ చిత్రంలో స్పెషల్ సాంగ్ లో సందడి చేసింది.
6) అనుష్క:
ఈ అరుంధతమ్మ కెరియర్ మొదట్లోనే స్టాలిన్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన ప్రత్యేక పాటలో సందడి చేసింది. అదేవిధంగా నాగార్జున కేడి సినిమాలో కూడా ఓ ప్రత్యేక పాటలో కనిపించారు.
7) హన్సిక:
దేశముదురు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న హన్సిక ప్రభాస్ నటించిన బిల్లా సినిమాలో స్పెషల్ సాంగ్ లో సందడి చేశారు.
8) రాయ్ లక్ష్మి:
రాయ్ లక్ష్మి మెగాస్టార్ ఖైదీ నెంబర్ 150, పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్, రవితేజ బలుపు వంటి సినిమాలలో స్పెషల్ సాంగ్స్ లో సందడి చేశారు.
9) రంభ:
సీనియర్ హీరోయిన్ అయిన రంభ ఎన్టీఆర్ నటించిన నాగ, యమదొంగ చిత్రాల్లోనే కాకుండా అల్లు అర్జున్ దేశముదురు సినిమాలో కూడా ప్రత్యేక పాటలో సందడి చేశారు.
10) ఆర్తి అగర్వాల్:
నువ్వు నాకు నచ్చావ్ సినిమా ద్వారా హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకున్న ఆర్తిఅగర్వాల్ నరసింహుడు చత్రపతి సినిమాలో ప్రత్యేక పాటలలో సందడి చేశారు.