లవర్స్ కి ప్రైవసీ దొరికే చోటు అదే అంటున్న యాంకర్ సుమా.. !!

Suma Kallamadi
బుల్లితెరలో యాంకరింగ్ చేయడానికి ఎంతోమంది వచ్చారు. కానీ కొంతమంది మాత్రమే ఇప్పుడు రాణిస్తున్నారు. అయితే ఎంతమంది వచ్చిన, ఎన్ని సంవత్సరాలు అయిన తనకి సాటి వేరే ఎవరు లేరు అని బుల్లితెరపై మకుటం లేని మహారాణిలాగా యాంకరింగ్ చేస్తూ వస్తుంది సుమా. దశాబ్దానికిపైగా సుమ తన యాంకరింగ్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది.ప్రస్తుతం సుమ ప్రతీ చానెల్‌లో కనీసం ఓ షో చేస్తోంది. ఈటీవీలో క్యాష్, స్టార్ మహిళా, స్టార్ మాలో స్టార్ట్ మ్యూజిక్, జీ తెలుగులో బిగ్ సెలెబ్రిటీ చాలెంజ్ వంటి షోలతో క్షణం తీరిక లేకుండా బిజీ లైఫ్ లీడ్ చేస్తుంది. అలాగే సినిమా ఆడియో ఫంక్షన్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్‌లంటూ బిజీగా ఉంటోంది. ఈ క్రమములో  సుమ హోస్ట్‌గా చేసే  క్యాష్ ప్రోగ్రామ్ ప్రోమో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది

ఈ షో కి శశి మూవీ యూనిట్ సభ్యులు  గెస్టులుగా వస్తున్నారు. హీరో ఆది, హీరోయిన్లు సురభి, రాశీ సింగ్, డైరెక్టర్ శ్రీనివాస్ నాయుడు సుమతో  క్యాష్ ఆట ఆడేందుకు వచ్చారు. ఈ క్రమంలో వారిని  సుమ ఒక లెవెల్ లో ఆట ఆడుకుంది.సుమ యాంకర్‌గా ఉన్న షోలో పంచ్‌ల వర్షం మాములుగా ఉండదు. ఇప్పుడు ఎలాంటి పంచ్ వేస్తుందో తనకే తెలియదు. అలానే శశి టీం మీద సుమ సెటైర్లతో దాడి చేసింది.

ఈ షో లో  సుమ టూరిజం అనే కాన్సెప్ట్‌తో శశి టీంను ఒక విధంగా ఆడుకుంది. మా టూరిజంలో చాలా ఆప్షన్స్ ఉన్నాయని, ప్రేమికులకు ఇష్టమైన ప్లేస్‌కు తీసుకెళ్తామని ఆది, సురభిలకు చెప్పింది సుమ. వాళ్ళు కూడా ఎంతో ఆతృతగా ఇక్కడకి తీసుకుని వెళ్తుందా అని ఎదురు చూసారు. తీరా చూస్తే స్మశాన వాటికను చూపించింది. నేను చెబుతున్నాను.. లవర్స్‌కు ఇంతకన్నా ప్రైవసీ ఎక్కడా దొరకదు అని సుమ తెలిపింది.సుమా సమాధానం విని అందరు షాక్ అయ్యారు. స్మశానం అయితే ఎవ్వరూ కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు. ఒక్క కాటికాపరి తప్పా, పార్కుల్లో అయితే పోలీసులు వచ్చి లేపుతారు.. కానీ ఇక్కడైతే మనమే లేచిపోవాలి.. అని సుమ కౌంటర్ వేసింది.సుమా మాటలకూ సెట్ లోని వారు అంతా నవ్వులు పండించారు.. !!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: