శ్రీకారం 9 రోజుల్లో ఎంత రాబట్టిందంటే...?

Purushottham Vinay
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ చాలా ప్లాపుల తరువాత హిట్ కోసం ఎంతో ఆశతో నటించిన చిత్రం "శ్రీకారం ". నాచురల్ స్టార్ నాని గ్యాంగ్ లీడర్ సినిమాలో నటించి యూత్ ని ఎంతగానో మెప్పించిన ప్రియాంకా అరుళ్ మోహన్ ఇందులో హీరోయిన్ గా నటించింది. కిశోర్.బి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 11న శివరాత్రి కానుకగా విడుదలయ్యింది. మొదటి షో నుండీ ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. మంచి కథ అలాగే ఈ సినిమాలో సమాజానికి ఉపయోగపడే మంచి మెసేజ్ కూడా ఉంది..ఒకసారి చూడొచ్చు అని కొంత మంది ప్రేక్షకులు పాజిటివ్ కామెంట్లు చేసినప్పటికీ.. టికెట్ రేట్లు పెంచెయ్యడం వలన ప్రేక్షకులు ఈ చిత్రాన్ని లైట్ తీసుకున్నారు.ఇక ఒక వేళ టికెట్ రేట్లు పెంచకుండా ఉంటే ఈ సినిమా కనీసం బ్రేక్ ఈవెన్ అయినా అయ్యుడేది. ఇక మొదటి రోజు పర్వాలేదు అనిపించిన ఈ చిత్రం కలెక్షన్లు ఆ తరువాత నుండీ తగ్గుతూ వస్తున్నాయి.

ఇక ఈ సినిమా 9 రోజుల కలెక్షన్స్ విషయానికి వస్తే..'శ్రీకారం' చిత్రానికి 17.1 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది కాబట్టి.. బ్రేక్ ఈవెన్ కు 17.5కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.9 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం కేవలం 9.38 కోట్ల షేర్ ను రాబట్టింది. అంటే బ్రేక్ ఈవెన్ కు ఇంకా 7.62 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.నిజానికి ఈ సినిమా చేసిన బిజినెస్ ఎక్కువే అంతేకాక టికెట్ రేట్లు కూడా పెంచారు. పైగా శర్వ కి వరుస ప్లాపులతో మార్కెట్ కూడా పోయింది. ఇన్ని కారణాల వల్ల ఈ సినిమా పెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది.పైగా "జాతి రత్నాలు" లాంటి ఆణిముత్యం లాంటి సినిమా పోటీగా ఉండటంతో జనాలు ఈ శ్రీకారాన్ని పూర్తిగా లైట్ తీసుకున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: