అలియా భట్ ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటించే ఛాన్స్ ఎలా దక్కించుకున్నారో తెలుసా..

Suma Kallamadi
బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నడంతో అసాధారణమైన స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఇతర భాష ప్రేక్షకులే రాజమౌళి తదుపరి సినిమా విడుదల వెయ్యి కళ్ళతో వేచి చూస్తున్నారు అంటే అతిశయోక్తి కాదు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తుండటంతో అంచనాలు మరింత పెరిగి పోయాయి. ప్రస్తుతం సినిమా సంబంధించిన షూటింగ్ శరవేగంగా పూర్తవుతుంది. రామ్ చరణ్ కి జంటగా నటిస్తున్న అలియా భట్ ప్రస్తుతం షూటింగ్ లో యాక్టివ్ గా పాల్గొంటున్నారు.


ఈ ముద్దుగుమ్మ తెలుగు భాష కూడా నేర్చుకుంటున్నారట. లాక్ డౌన్ కి ముందస్తుగానే ఆమె తెలుగు భాషను నేర్చుకోవడం ప్రారంభించారు. ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని 450 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఈ సినిమాలో ఆమె సీత పాత్ర పోషిస్తున్నారు. పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ కూడా సినిమా బృందం విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే ఆమె ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించే అవకాశం ఎలా దక్కించుకున్నారో తెలియజేశారు.


"విమానాశ్రయంలో రాజమౌళి ని నేను కలిశాను. తదుపరి సినిమా లో ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్ అని అడిగాను. కావాలంటే కాల్ షీట్ కూడా అడ్జెస్ట్ చేసుకుంటానని రాజమౌళికి నేను మాటిచ్చాను. ఐతే ఒక్క వారం లోనే రాజమౌళి నుంచి నాకొక ఫోన్ కాల్ వచ్చింది. ఆయన నాకు సీత పాత్ర గురించి చెప్పారు. ఆ విధంగా నేను ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకున్నాను," అని అలియా భట్ చెప్పారు. ఆమె నెక్స్ట్ బాలీవుడ్ చిత్రం 'గంగూబాయి కతియావాడి' త్వరలోనే విడుదల కానున్నది.


సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న బయోగ్రఫీ డ్రామా "గంగూబాయి కతియావాడి" లో అలియా నటిస్తున్నారు. ఆమె ముంబైలోని రెడ్ లైట్ జిల్లా కామతీపురాలో గ్యాంగ్ స్టర్ పాత్ర పోషిస్తున్నారు. ఆమె రణబీర్ కపూర్ తో కలిసి బ్రహ్మాస్త్రా సినిమాలో నటిస్తున్నారు. ఈ మూడు చిత్రాలు ఒక్కొక్కటి రూ. 150 కోట్లకు బడ్జెట్లతో రూపొందటం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: