పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేణు శ్రీరామ్ ల తొలి కలయికలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ వకీల్ సాబ్. కొన్నాళ్ల క్రితం బాలీవుడ్ లో రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకుని విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకున్న కోర్టు డ్రామా మూవీ పింక్. అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకి రీమేక్ గానే ప్రస్తుతం వకీల్ సాబ్ రూపొందుతోంది. తొలిసారిగా దిల్ రాజు, బోనికపూర్ కలిసి సంయుక్తంగా ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ సినిమాలో అంజలి, నివేదాథామస్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలు చేస్తుండగా పీఎస్ వినోద్ ఫోటోగ్రఫీని తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన రెండు సాంగ్స్ అలానే ఫస్ట్ లుక్ టీజర్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకోవడంతో పాటు మూవీపై భారీ అంచనాలు కూడా క్రియేట్ చేశాయి. పవన్ కళ్యాణ్ ఇందులో పవర్ఫుల్ లాయర్ పాత్ర చేస్తుండగా ఆయనకు జోడీగా శృతిహాసన్ నటిస్తోంది. దాదాపుగా మూడేళ్ల గ్యాప్ తర్వాత పవన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఆయన అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మంచి మెసేజ్ తో పాటు పక్కా కమర్షియల్ జానర్లో ఈ మూవీ రూపొందుతుందని టాక్.
అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమాని అన్ని వర్గాల ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా అలాగే పవర్ స్టార్ ఇమేజ్ ని దృష్టిలో ఉంచుకుని దర్శకుడు వేణు శ్రీరామ్ ఎంతో అద్భుతంగా తీస్తున్నారని పక్కాగా రిలీజ్ తర్వాత ఈ మూవీ ప్రభంజనం సృష్టించడం ఖాయమని అంటున్నారు. మరి ఏప్రిల్ 9న ఎంతో గ్రాండ్ లెవల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తుందో తెలియాలి అంటే మరొక ఇరవై రోజుల వరకు వెయిట్ చేయక తప్పదు.....!!