‘దేవరాయ’ ఇప్పట్లో రాదా?

Chowdary Sirisha
తెలుగు సినీ పరిశ్రమలో వాయిదాల పర్వం నడుస్తోంది. మరో చిత్రం వాయిదా పడటానికి సిద్ధమైంది. అది దేవరాయ సినిమా. శ్రీకాంత్ కి ప్రస్తుతం బ్యాడ్ టైమ్ నడుస్తున్నట్టుంది. లేకపోతే తాను హీరోగా నటించిన సినిమాలే కాదు, తాను ఇతర పాత్రల్లో కనిపించిన శ్రీరామరాజ్యం, శిరిడిసాయి కూడా ఫ్లాపవడంతో శ్రీకాంత్ ను దూరంగా పెడుతున్నారు నిర్మాతలు. ఇటీవల విడుదలైన లక్కీ సినిమా... ‘అదెప్పుడు విడుదలైంది’ అని అడిగేవాళ్లూ ఉండొచ్చు. లక్కీ శ్రీకాంత్ లక్ ని ఏమాత్రం మార్చలేకపోయింది. వీటికి తోడు శ్రీకాంత్ మెడకు ఇప్పుడు దేవరాయ కూడా చుట్టుకుంది. సుమారుగా ఆరునెలలుగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాని ఎప్పుడు విడుదల చేస్తారో తెలియడం లేదు. నవంబరులో చేసేస్తామని అక్టోబరులో ప్రకటించినా ఇప్పటివరకూ విడుదల ఊసును ఎవ్వరూ ఎత్తడం లేదు. అందుకు ప్రధాన కారణం... సినిమాను కొనేవాళ్లు రాకపోవడమే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. పెద్ద హీరోల సినిమాలకే తిప్పలు తప్పడం లేదు... శ్రీకాంత్ సినిమా ఏమాత్రం. పోనీ, అన్నయ్య చిరంజీవి అయినా శ్రీకాంత్ కి ఏమన్నా సాయం చేస్తాడేమో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: