కొరటాల శివ పిల్లలు వద్దనుకోవడానికి కారణం ఇదేనట..?
సేజ్ ఓరియెంటెడ్ సినిమాలకు కమర్షియల్ అంశాలు జోడించి సినిమా తీయడంలో కొరటాల శివ పనితనం ఏంటో అయన గత చిత్రాలు చూసి చెప్పొచ్చు. ఈ సినిమా కూడా అలాంటి సినిమాగానే తెరకెక్కుతుంది. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా కి మణిశర్మ సంగీతం అందిస్తుండగా దేవాలయాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుండడం విశేషం..రామ్ చరణ్ లుక్ రిలీజ్ అయ్యింది.. సిద్ధ అనే పాత్రలో రామ్ చరణ్ నటిస్తుండగా ఈ పాత్ర లుక్ ని రిలీజ్ చేసింది చిత్ర బృందం.. ఈ లుక్ తో సినిమా పై అంచనాలు మరింత పెరిగాయని చెప్పొచ్చు.
ఇక కొరటాల శివ పర్సనల్ లైఫ్ గురించి చాలా తక్కువమందికే తెలుసు.. తాజగా ఈయన గురించి చిరంజీవి ఇప్పుడు ఓ ఆసక్తికరమైన విషయం బయటికి చెప్పాడు. పెళ్లై ఇన్నేళ్లైనా కూడా మీరెందుకు పిల్లల్నెందుకు కనలేదని చాలా మంది సోషల్ మీడియాలో ప్రశ్నలు సంధించారు. దానికి కొరటాల కూడా మౌనంగానే ఉన్నాడు. ఏ రోజు సమాధానం అయితే చెప్పలేదు. అయితే ఇప్పుడు దీనికి చిరు ఆన్సర్ ఇచ్చాడు. కొరటాలను తాను దర్శకుడిగా కంటే కూడా వ్యక్తిగా చాలా గౌరవిస్తానని చెప్పాడు మెగాస్టార్. అలాంటి వ్యక్తిని తన జీవితంలో మళ్లీ చూస్తానని కూడా అనుకోవడం లేదని చెప్పాడు ఈయన. సామాజిక బాధ్యత ఉన్న వ్యక్తిగా కొరటాలకు తాను నూటికి నూరు మార్కులు వేస్తానంటున్నాడు.అంతేకాదు.. తనతో పాటు తన భార్య సంపాదించే దానిలో సగం సమాజం కోసమే ఖర్చు చేయడం అనేది అభినందనీయం అని చెప్పాడు ఈయన. ఇక సమాజం కోసమే పిల్లలను కూడా వద్దనుకున్న మహా మనిషి కొరటాల శివ అంటూ చెప్పుకొచ్చాడు చిరంజీవి.