చిరంజీవి సినిమాల్లో టైటిల్ కార్డ్స్ లో ఇవి గమనించారా ఎప్పుడైనా..!?

Suma Kallamadi
తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మెగాస్టార్ చిరంజీవి. పరిచయం అసలు అవసరం లేని వ్యక్తి.తనదైన శైలిలో సినిమాలో నటిస్తూ స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు. ఇక శివశంకర వరప్రసాద్ గా పుట్టి, చిరంజీవిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మెగాస్టార్ గా ఎంతోమంది ప్రేక్షకులకు చేరువయ్యారు. ఎంతోమంది అప్ కమింగ్ హీరోలకి ఆదర్శంగా నిలిచారు. అంత ఎత్తుకు ఎదిగారు అంటే, దాని వెనకాల చిరంజీవి ఎంత హార్డ్ వర్క్ చేశారో అర్థం చేసుకోవచ్చు.

ఇక సినిమా ఫలితం ఎలా ఉన్నా కానీ మెగాస్టార్ పర్ఫామెన్స్ కి వంక పెట్టడానికి ఉండదు. అయితే చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన మొదట్లో చిరంజీవి విలన్ ప్రాతలో చేశారు. తర్వాత హీరోగా మారారు. తన నటనతో, డాన్స్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. చిరంజీవి తాను చేసే  ప్రతి సినిమాని అంతే శ్రద్ధగా చేస్తారు. అయితే అది కేవలం పర్ఫార్మెన్స్ విషయంలో మాత్రమే కాకుండా, పాటల విషయంలో, కాస్ట్యూమ్స్ విషయంలో కూడా ఎంతో శ్రద్ధ వహిస్తారు. ఇవన్నీ మాత్రమే కాకుండా టైటిల్ విషయంలో కూడా ఎంతో క్రియేటివ్ గా ఆలోచిస్తారు.

అలా మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో కొన్ని టైటిల్స్ లో మెగాస్టార్ కూడా కనబడేలా క్రియేటివ్ గా డిజైన్ చేశారు. అంటే టైటిల్ లోగో లో చిరంజీవి కూడా ఉంటారు అన్నమాట. అలా తన సినిమా టైటిల్స్ లో చిరంజీవి ఫోటో కనపడే టైటిల్స్ కొన్ని ఉన్నాయి అవి ఏంటో ఒక్కసారి చూద్దమా.  అందరివాడు, మృగరాజు, ఖైదీ నెంబర్ 150, అన్నయ్య, ఇంద్ర, శంకర్ దాదా ఎంబిబిఎస్, ముగ్గురు మొనగాళ్ళు, శంకర్ దాదా జిందాబాద్, జేబుదొంగ, స్టేట్ రౌడీ, బావగారు బాగున్నారా, పసివాడి ప్రాణం, జై చిరంజీవ, చూడాలని ఉంది, ఖైదీ, రుద్రనేత్ర, డాడీ, యముడికి మొగుడు, మాస్టర్, రౌడీ అల్లుడు సినిమాలకు క్రియేటివ్ గా టైటిల్స్ పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: