వకీల్ సాబ్ తర్వాత అయినా.. ఆ హీరోయిన్కు ఆఫర్ల పెరుగుతాయా..?

praveen
తెలుగు చిత్ర పరిశ్రమలో నివేద థామస్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అనే విషయం తెలిసిందే. చేసింది కొన్ని సినిమాలే అయినప్పటికీప్రేక్షకులకు ప్రేమాభిమానాలు మాత్రం ఎంతగానో సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి తన నటనతో ఇప్పటికే విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది అన్న విషయం తెలిసిందే. అంతే కాదు మంచి విజయాలను కూడా తన ఖాతాలో వేసుకుంది నివేద థామస్. అయితే హీరోయిన్ కు ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ ఆవగింజంత అదృష్టం కూడా కావాలి అని చెబుతూ ఉంటారు పెద్దలు. అయితే ఈ హీరోయిన్ విషయంలో అది మాత్రం లేదు అన్నది అర్థం అవుతూ ఉంటుంది


 నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేసుకుంటూ..  విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ గ్లామర్ రోల్స్ కి దూరంగా ఉండడంతో ఎక్కువగా ఆఫర్లు ఈ అమ్మడి చెంత వాలడం లేదు. దీంతో తక్కువ ఆఫర్ లతోనే కెరీర్ను నెట్టుకొస్తుంది నివేదాథామస్. ఇక  ఇటీవలే సుధీర్ బాబు నాని ఇద్దరు హీరోలుగా మల్టీస్టారర్ గా తెరకెక్కిన వి సినిమాలో కూడా నివేదాథామస్ నటించిన విషయం తెలిసిందే.  ఇక ఇప్పుడు నివేదాథామస్ ఆశలు మొత్తం ఒకే ఒక్క సినిమాపై ఉన్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హిందీ హిట్ మూవీ పింక్ తెలుగు రీమేక్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే.

 అయితే ఈ రీమేక్ మూవీ లో ప్రస్తుతం నివేద థామస్ కూడా నటిస్తుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి బిగ్ అప్డేట్ కోసం అటు ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటివరకు అడపాదడపా అవకాశాలు దక్కించుకున్నా నివేదాథామస్ కెరీర్ ని నెమ్మదిగా నెట్టుకొస్తోంది. వకీల్  సాబ్  సినిమా విడుదలైన తర్వాత మంచి విజయం సాధిస్తుంది అని విశ్లేషకులు కూడా భావిస్తూ ఉండడంతో ఇక వఖిల్ సాబ్   తర్వాత ఈ అమ్మడి ఆఫర్లు  పెరిగే అవకాశం ఉంది అని అంటున్నారు కొంతమంది సినీ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: