పాపం, భీం అలా .... రామరాజు ఇలా .... ఇంతకీ అది నిజమా కాదా ....??

GVK Writings
దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఎన్టీఆర్ కొమరం భీం పాత్ర చేస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ యొక్క క్లైమాక్స్ సన్నివేశాలను హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన ప్రత్యేక సెట్టింగ్ లో తీస్తున్నారు యూనిట్ సభ్యులు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి కీరవాణి మ్యూజిక్ అందిస్తుండగా వి విజయేంద్ర ప్రసాద్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">విజయేంద్ర ప్రసాద్ స్టోరీని అందిస్తున్నారు.

ప్రముఖ మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్న ఈ మూవీకి సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫి అందేసితున్నారు. తొలిసారిగా మెగా నందమూరి హీరోలు ఇద్దరూ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఇటీవల వీరిద్దరి భీం ఫర్ రామరాజు, రామరాజు ఫర్ భీం టీజర్స్ రెండూ కూడా యూట్యూబ్ లో రిలీజ్ అయి ఆడియన్స్ నుండి విశేషమైన స్పందనను అందుకోవడంతో పాటు ఇప్పటివరకు మూవీ పై వారందరిలో ఉన్న అంచనాలు అమాంతం పెంచేసాయి అనే చెప్పాలి. 

సముద్ర ఖని, రాహుల్ రామకృష్ణ, శ్రియ శరన్, అజయ్ దేవగన్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమా 1920 కాలం నాటి కథగా మంచి యాక్షన్ తో కూడిన ఎమోషనల్ ఎంటర్టైనర్ గా పేట్రియాటిక్ నేపథ్యంలో రాజమౌళి తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా యొక్క క్లైమాక్స్ కి సంబంధించి రెండో రోజులుగా ఒక వార్త పలు మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది. దాని ప్రకారం క్లైమాక్స్ సీన్ లో అల్లూరి కి కళ్ళు, అలానే భీం కి ఒక కాలు పోతుందని, కానీ ఇద్దరూ కూడా ఒకరి సాయాన్ని మరొకరు తీసుకుని తెలివిగా బ్రిటీష్ వారిని మట్టుబెడతారని, ఈ సన్నివేశాన్ని రాజమౌళి తన స్టైల్ లో ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఎంతో అద్భుతంగా తీస్తున్నారని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందొ తెలియాలి అంటే ఈ మూవీ రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు విశ్లేషకులు....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: