
మోసగాళ్ళ సినిమా విషయంలో విష్ణు చేస్తున్న ఆ ప్లాన్ వర్క్ ఔట్ అవుతుందా?
ఇక పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సునీల్ శెట్టి, కాజల్ లాంటి స్టార్లు కూడా నటించాడు. నవదీప్, నవీన్ చంద్ర లాంటి యంగ్ హీరోలు కూడా ఈ సినిమాలో కనిపిస్తారు. టెక్నాలజీని వాడుకుంటూ కోట్లలో మోసం చేసే మోసగాళ్ళ కథతో ఈ సినిమాను తెరకెక్కించారు.ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే విడుదలకు ముందే ఈ సినిమాలోని తొలి పది నిమిషాల ఎపిసోడ్ ని చూపించేస్తారట.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం లాంటి ప్రధాన నగరాలలో స్క్రీనింగ్ ఏర్పాట్లు చేసి.. తొలి పది నిమిషాల సినిమాను ప్రదర్శించే ఏర్పాట్లలో ఉన్నారట. ఈ విధంగా చేయడం వలన ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరుగుతుందని మంచు విష్ణు భావిస్తున్నాడు. మరి విష్ణు ప్లాన్ ఎంతవరకు ఫలిస్తుందో లేదో చూడాలి! ఇక ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో విష్ణు విడుదల చెయ్యబోతున్నాడట...ఇక ఖచ్చితంగా ఈ సినిమా అందరిని ఆకట్టుకొని పెద్ద హిట్ అవ్వడం ఖాయమని మంచు విష్ణు చాలా నమ్మకంగా వున్నాడట.. ఇక చూడాలి హాలీవుడ్ రేంజిలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో...