మంగ్లీ పాడిన టాప్ సాంగ్స్ లో.. ఏ పాట మీ ఫేవరెట్..?
మంగ్లీ ఏ పాట పాడినా ఆ పాటకు చక్కని రూపాన్ని తీసుకొస్తుంది. జానపద గేయాలతో మొదలైన మంగ్లీ, ప్రస్తుతం వస్తున్న ట్రెండింగ్ సినిమాలలో పాడుతున్న ప్రతిపాట మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. అయితే ఈమె కేవలం సినిమాలలోనే కాకుండా ప్రైవేట్ సాంగ్స్ కూడా పాడి, ఈమె చాలా హిట్ అయ్యింది.. ఈ సందర్భంగా మంగ్లీ ని ఫోక్ సాంగ్స్ కి సినోనిమ్ అని పేరు పెట్టొచ్చు. అయితే ఎన్నో ప్రైవేట్ సాంగ్ లను పాడి, యూట్యూబ్ లో మంచి పేరు సంపాదించుకుంది మంగ్లీ.. మంగ్లీ తన పెక్యులియర్ వాయిస్ తో ప్రేక్షకులందరినీ ఇట్టే ఆకట్టుకుంటుంది.. అయితే ఇప్పటివరకు తన పాడిన పాటలలో ద బెస్ట్ అనిపించుకున్న పాటలలో మీకు ఏ పాట నచ్చుతుందో ఇప్పుడు చూద్దాం..
లవ్ స్టోరీ :
ఈ సినిమాలో "సారంగదరియా" పాటకు సాయి పల్లవి వేసిన స్టెప్పులు అందరినీ ఎంతో ఆకట్టుకుంటున్నాయి. అయితే ప్రస్తుతం సారంగదరియా పాట పై కొన్ని చర్చలు జరుగుతున్నప్పటికీ, మంగ్లీ పేరు మాత్రం మారుమ్రోగుతోంది. ఈ పాటకు ఒక చక్కని గొంతును జోడించి, మంగ్లీ పాడిన ఈ పాట అదుర్స్..
శివుడి పాటలు :
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈషా ఫౌండేషన్ వారు మంగ్లీ తో శివుడి పాటలు, ఏకంగా 5 పాటలు పాడించారు. ప్రస్తుతం ఈ పాటలు సోషల్ మీడియా తో పాటు యూట్యూబ్ లో కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి.. అందులో మంగ్లీ పాడిన 5 పాటలు మంచి ప్రత్యేకతను అందుకుంటున్నాయి..
జార్జి రెడ్డి :
"వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్ " అనే ఈ పాట ప్రస్తుతం కళాశాల అమ్మాయిల అందరి నోళ్లలో బాగా ప్రాచుర్యం పొందింది. ఈ పాటకు అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా చాలా ఫిదా అవుతున్నారు. మంగ్లీ గొంతుక హ్యాట్సాఫ్ కూడా చెప్తున్నారు.
శైలజా రెడ్డి అల్లుడు :
శైలజ రెడ్డి అల్లుడు చూడే అనే మంగ్లీ పాడిన పాట మహా అద్భుతం.. చక్కని గొంతుతో పాడి ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది..
ఆడ నెమలి :
ఆడ నెమలి అనే ఒక ఫోక్ సాంగ్ ను పాడి, తను కేవలం పాటలు మాత్రమే పాడగలగడమే కాకుండా డాన్స్ కూడా వేయగలనని నిరూపించింది. పల్లె ప్రాంతాల్లో పాడే ఈ పాట చక్కని రూపుదిద్దుకుంది.
అలా వైకుంఠపురంలో :
" రాములో రాముల నన్ను ఆగం చేసింది రోయ్ " ఈ పాట ప్రతి చిన్న పిల్లవాడి నోటిలో కూడా మారుమ్రోగింది. చిన్నా పెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరి మొబైల్స్ లోనూ, నోళ్ల ల్లోను ఈ పాటను మనం వింటూనే వస్తున్నాం.
బతుకమ్మ సాంగ్స్ :
బతుకమ్మ సాంగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బతుకమ్మ పాటలకు మంగ్లీ పెట్టింది పేరుగా చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఈమె పాడే ప్రతి పాట అంత అద్భుతంగా ఉంటుంది..
ఇవే కాదు ఇంకా ఎన్నో పాటలు పాడి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది మంగ్లీ. ఇలా ఎన్నో మంచి మంచి పాటలను పాడి, ప్రేక్షకులను మరింత మైమరిపించేలా చేయాలని కోరుకుంటూ.. మంగ్లీ కు మన ఇండియా హెరాల్డ్ తరుపున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు..