చెక్ కలెక్షన్స్...భారీ డిజాస్టర్ దిశగా అడుగులు....

Purushottham Vinay
టాలీవుడ్ ప్రముఖయంగ్ హీరో యూత్‌ స్టార్‌ నితిన్‌ గతేడాది "భీష్మ" సినిమాతో మంచి బంపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే... ఆ సినిమాతో నితిన్ కి అప్పుడు వరుస ప్లాపులకి బ్రేక్ పడింది. ఆ సినిమా మంచి విజయం అందుకోని మంచి బ్రేక్ ఇచ్చింది నితిన్ కి. ఇక ఆ సినిమా తరువాత నితిన్ ఒక సంవత్సరం పాటు బ్రేక్ తీసుకోని మళ్ళీ హీరోగా ఎన్నో అంచనాలతో చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో "చెక్ " సినిమా చేశాడు.'భవ్య క్రియేషన్స్' బ్యానర్ పై వి. ఆనందప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమాలో తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎదిగి ఇప్పుడు ఫామ్ కోల్పోయిన హాట్ బ్యూటీ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌,అలాగే నేషనల్ క్రష్ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ వంటి క్రేజీ భామలు హీరోయిన్లుగా నటించారు…ఇక ఈ సినిమా ఫిబ్రవరి 26న విడుదలైంది. మొదటి షో నుండీ ఈ చిత్రానికి…కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ… దానిని క్యాష్ చేసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యింది.బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన కలెక్షన్స్ ని రాబడుతూ చతికాల పడింది.


ఇక ఈ సినిమా మొదటి రోజు మంచి టాక్ తో కొంచెం బాగానే కలెక్ట్ చేసినప్పటికీ ఆ తరువాత నుండీ బాగా డౌన్ అవుతూ తక్కువ కలెక్షన్స్ ని రాబడుతూ నిరాసపరుస్తుంది.ఇక నితిన్ నటించిన ఈ 'చెక్' సినిమాకి రూ.16.10కోట్ల బిజినెస్ జరిగింది కాబట్టి.. బ్రేక్ ఈవెన్ కు రూ.16.60 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 9 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం కేవలం 9.12 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 7.42 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. రెండో శుక్రవారం నాడు ఈ చిత్రం కేవలం 0.06 కోట్ల షేర్ ను రాబట్టింది.ఇక ట్రేడ్ లెక్కల ప్రకారం చూసినట్లయితే ఈ సినిమా భారీ డిజాస్టర్ వైపు అడుగులు వేస్తుంది...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: