అచ్చం హీరోయిన్ లా కనిపిస్తున్న ఈ స్టార్ యాంకర్ ని గుర్తుపట్టారా..??
అప్పట్లో దిగిన ఫొటోషూట్ ఇప్పుడు ఒకటి బాగా వైరల్ అవుతుంది.ఆ మధ్య తన సోషల్ మీడియా పేజీలో అభిమానులతో పంచుకుంది సుమ. పెళ్లికి ముందు.. సీరియల్స్ చేసే సమయంలో దిగిన ఫోటోను షేర్ చేసింది ఈ సీనియర్ యాంకర్. దాంతో పాటు మరికొన్ని ఫోటోలను కూడా షేర్ చేసింది సుమ. అందులో ఒకటి స్కూల్ డ్రెస్‌లో ఉన్న ఫోటో కూడా ఉంది. కింద కూర్చుని వినయంగా నమస్కారం చేస్తున్నది ఒకటి అయితే.. మరొకటి సింపుల్‌గా నవ్వుతూ ఉన్న ఫోటో. ఈ రెండింట్లోనూ అందులో చాలా అందంగా.. హీరోయిన్ మాదిరే ఉంది సుమ.
అప్పట్లో చాలా సినిమాలలో సుమకు అవకాశాలు కూడా వచ్చాయి. అయితే ఆమెకు మాత్రం హీారోయిన్ అవ్వాలని.. స్టార్ అయిపోవాలనే ఆలోచన లేదు. అందుకే కొన్ని మంచి అవకాశాలు వచ్చినా కూడా కేవలం సీరియల్స్ వైపు అడుగులేసింది. దాంతో పాటు కొన్ని సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసింది సుమ కనకాల.నిజానికి అప్పట్లో 1996లో దాసరి తెరకెక్కించిన కళ్యాణ ప్రాప్తిరస్తు సినిమాలో ఈమె హీరోయిన్గా నటించింది కూడా. ఆ తర్వాత సీరియల్స్.. ఆ తర్వాత యాంకరింగ్ వైపు వచ్చింది. ప్రస్తుతం తెలుగులో టాప్ యాంకర్‌గా కొనసాగుతుంది...!!