మహేష్ బాబు డైరెక్టర్ కు ఓకే చెప్పిన బాలయ్య.. ఫాన్స్ లో ఆత్రుత..?
ఇక ఈ సినిమాపై అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో నటించబోతున్న తరుణంలో ఇక ఈ సినిమా ఎలా ఉండబోతుందో అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక పోతే ఇక ఈ సినిమా తర్వాత మరో సినిమాను లైన్ లో పెట్టేందుకు బాలయ్య సిద్ధమైనట్లు తెలుస్తోంది. గతంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఫుల్ టైం కామెడీ రోల్ చేసిన బాలయ్య మరోసారి అలాంటి రోల్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఫుల్ కామెడీ ఎంటర్ టైన్ మెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పిన కథ నచ్చడంతో ఓకే చేసినట్లు ప్రస్తుతం టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది.
ఈ క్రమంలోనే బాలయ్య తర్వాత సినిమా దాదాపుగా యువ దర్శకుడు అనిల్ రావిపూడి తో కన్ఫార్మ్ అయినట్లే అని అంటున్నారు సినీ వర్గాల పెద్దలు. ఇక ఈ సినిమాను దిల్ రాజు నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది అయితే బాలయ్య దిల్ రాజు కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇదే మొదటిది కావడం గమనార్హం. లేకపోతే అటు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా తో పాటు అనిల్ రావిపూడి సినిమాను కూడా ఏకకాలంలో ముందుకు నడిపేందుకు సిద్ధమయ్యాడు నందమూరి బాలకృష్ణ. ఇక పోతే ఈ బాలయ్యతో ఈ యువ దర్శకుడి కాంబినేషన్ ఎలా ఉండబోతుందో అని ప్రస్తుతం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.