ఆర్ ఎక్స్ 100 అంత కొత్తవారితో వచ్చిన ఈ చిత్రం ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదలై బంపర్ హిట్ అయ్యింది. కార్తికేయ, రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">పాయల్ రాజ్ పుత్ హీరో, హీరోయిన్స్‌గా పరిచయమై తమ నటనతో అదరగొట్టారు. దాదాపు రెండు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా దాదాపు 20 కోట్ల దాకా వసూళ్లను రాబట్టింది. రెవెన్యూ పరంగానే కాకుండా సినిమాలో నటించిన పాయల్‌కు, హీరోగా చేసిన కార్తికేయకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాతో సూపర్ పాపులరైన రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">పాయల్ రాజ్ పుత్ తెలుగులో మోస్ట్ హ్యపెనింగ్ హీరోయిన్ గా వరుస అవకాశాలను అందుకుంటుంది. హీరో కార్తికేయ కూడా వరుస సినిమాలు చేస్తూ అదరగొడుతున్నాడు.ఇప్పుడు ‘ఆర్ఎక్స్ 100’ హిందీలో రీమేక్ అవుతోంది. బాలీవుడ్ నటుడు సునీల్‌శెట్టి తనయుడు ఈ చిత్రం ద్వారా అరంగేట్రం చేస్తున్నాడు.నటుడు సునీల్ శెట్టి కుమారుడు అహన్ శెట్టి హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి ‘తడప్’ అని పేరు పెట్టారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ని ఈ రోజు ఆవిష్కరించారు. అహన్ హీరోయిన్ తారా సుతారియాను కౌగిలించుకోవడం పోస్టర్లో కనిపిస్తోంది. ‘యాన్ ఇన్క్రెడిబుల్ లవ్ స్టోరీ’ అనేది టైటిల్‌కు ట్యాగ్‌లైన్. ఫస్ట్ లుక్ తో ఈ మూవీపై అంచనాలు పెరిగిపోయాయట.ప్రీతమ్ సంగీతం సమకూర్చుతుండగా మిలన్ లుథ్రియా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘తడప్’ విడుదల తేదీ కూడా ఈ సందర్భంగా వెల్లడించారు. సెప్టెంబర్ 24 న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారట. ఈ సినిమా కూడా తెలుగు సినిమాలాగానే సూపర్ హిట్ అవుతుందో లేదో వేచి చూడాలి. ఇప్పటికే హిందీలో విడుదలైన అర్జున్ రెడ్డి రీమేక్ మీద ఎన్ని విమర్శలు వచ్చాయో మనం చూసాం. అయితే ఇప్పుడు ఈ ఆర్ ఎక్స్ 100 సినిమా మీద ఇంకెన్ని గొడవలు జరుగుతాయో.అయితే తెలుగులో కూడా ఈ సినిమా విడుదల ముందు చాలా కామెంట్స్ వచ్చాయి. కానీ సినిమా అవన్నీ దాటుకొని సూపర్ హిట్ అయింది.
మరింత సమాచారం తెలుసుకోండి: