ఆకాశానికి నిచ్చెన వేయడం అంటే ఇదే..!

NAGARJUNA NAKKA
దీపిక పదుకొణేకి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ క్రేజ్ ఉంది. ఈమెతో సినిమాలు చేసేందుకు టాప్ హీరోలు తహతహలాడుతున్నారు. కానీ దీపిక మాత్రం ఇండియన్‌ ఫిల్మ్స్‌ కంటే హాలీవుడ్‌ని ఎక్కువ ఫోకస్ చేస్తోంది. హాలీవుడ్‌ ఆఫర్స్‌ కోసం ఒక ఏజెన్సీతోనూ డీల్‌ సెట్‌ చేసుకుంది దీపిక.
దీపిక పదుకొణే పెళ్లి తర్వాత కూడా బాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గానే కంటిన్యూ అవుతోంది. పది కోట్లకుపైగా రెమ్యూనరేషన్‌ తీసుకుంటోంది. షారుఖ్ ఖాన్‌ నుంచి ప్రభాస్ వరకు చాలామంది దీపికని హీరోయిన్‌గా తీసుకోవడానికి పోటీ పడుతున్నారు. అయినా దీపిక పదుకొణే మాత్రం ఇండియన్‌ ఫిల్మ్ ఇండస్ట్రీ కంటే హాలీవుడ్‌కే ఎక్కువ ప్రియారిటీ ఇస్తోంది.
దీపిక పదుకొనే 'ట్రిపుల్ ఎక్స్-రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్' సినిమాతో హాలీవుడ్‌కి వెళ్లింది. విన్‌ డీజిల్‌తో కలిసి హంగామా చేసినా దీపికకి మళ్లీ హాలీవుడ్‌లో పెద్దగా ఆఫర్స్ రాలేదు. ఒకవైపు ప్రియాంక చోప్రా హాలీవుడ్‌లోనే పాగే వేస్తే, దీపికకి మాత్రం అక్కడ చోటు దక్కించుకోవడమే కష్టమైపోతోంది. దీంతో హాలీవుడ్‌ ఏజెన్సీలతో సంప్రదింపులు జరుపుతోంది దీపిక.
దీపిక పదుకొణే రీసెంట్‌గా అమెరికన్‌ టాలెంట్ ఏజెన్సీ 'ఐసీఎమ్'తో అగ్రిమెంట్‌ కుదుర్చుకుంది. ఈ కంపెనీకి హాలీవుడ్‌ కెరీర్‌ సెట్‌ చేసే బాధ్యతలు అప్పగించింది. జాన్‌సేనా,ఇయాన్‌ సోమర్‌హాల్డెర్‌ లాంటి హాలీవుడ్‌ స్టార్ల పీఆర్ బాధ్యతలు ఈ కంపెనీయే చూస్తోంది. దీంతో ఈమె బాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌కి వెళ్లిపోవడానికి తహతహలాడుతోందని కామెంట్ చేస్తున్నాడు ముంబాయి జనాలు. మరి దీపిక హాలీవుడ్‌కి వెళ్లిపోతే ఈమె భర్త రణ్‌వీర్‌ సింగ్‌ కూడా భార్యబాటలోనే అమెరికా వెళ్తాడా, లేకపోతే ముంబాయిలోనే ఉంటాడా అన్నది చూడాలి.  హాలీవుడ్ ను దీపిక పదుకొనే ఫోకస్ చేస్తోంది. అమెరికన్ టాలెంట్ ఏజెన్సీతో దీపిక అగ్రిమెంట్ కుదుర్చుకోవడం ఇపుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.  ట్రిపుల్ ఎక్స్ తర్వాత హాలీవుడ్ కు వెళ్లిన దీపికకు.. తర్వాత సరైన అవకాశాలు లేవు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: