పూరి జగన్నాధ్ కుమారుడి సినిమా రిలీజ్ ఆగిపోవడానికి కారణం ఇదేనా..

Suma Kallamadi
మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆయన హీరోగా నటించిన మెహబూబా, ఆంధ్ర పోరి సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఆయన మరొక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యారు. ఇటీవలే రొమాంటిక్ అనే టైటిల్ తో ఆయన ఒక సినిమా చేశారు. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని మే 20, 2020 తేదీన  రిలీజ్ కాబోతున్న నేపథ్యంలోనే లాక్ డౌన్ విధించారు. దీనితో ఆకాష్ పూరి, కేతిక శర్మ హీరోహీరోయిన్లుగా నటించిన 'రొమాంటిక్' సినిమా విడుదల వాయిదా పడింది. అయితే డిసెంబర్ నెల నుంచే అనేక సినిమాలు విడుదల అవుతున్నాయి కానీ ఫిబ్రవరి నెల పూర్తి అవుతున్నా కూడా 'రొమాంటిక్' సినిమా రిలీజ్ డేట్ ని ఫిలిం మేకర్స్ వెల్లడించడం లేదు.
 
 
 ఎందుకు అని అడిగితే.. ఈ సినిమాని నేరుగా డిజిటల్ ప్లాట్ ఫారం పై విడుదల చేయాలని భావిస్తున్నారట. అందుకే దర్శకనిర్మాతలు ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదని తెలుస్తోంది. లాక్ డౌన్ ఆంక్షలు సడలించిన తరువాత వరుసగా స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వేసవి కాలంలో కూడా భారీ సినిమాలు విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి. అందుకే ఈ ఏడాది చివరి వరకు రొమాంటిక్ సినిమా విడుదల చేయకూడదని నిర్మాతలు భావిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఈలోగా ఒకవేళ డిజిటల్ ప్లాట్ ఫామ్ లు ప్రపోజ్ చేసే డీల్ నచ్చితే 'రొమాంటిక్' సినిమా ని విక్రయించే అవకాశాలు ఉన్నాయి.
 
 
 ఇకపోతే ఆకాష్ పూరి జార్జ్ రెడ్డి ఫేమ్ జీవన్ రెడ్డి తో కలిసి చోర్ బజార్ అనే ఓ సినిమా చేయడానికి రెడీ అయిపోయారు. ఈ సినిమా కోసం ఆయన శరీరాకృతిని మార్చుకొనున్నారట. ఇటీవల హైదరాబాద్ లో ఈ సినిమాని లాంచ్ కూడా చేశారు. ఫిబ్రవరి 26వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: