జూనియర్ ఎన్టీఆర్ వదిలేసిన సూపర్ హిట్ సినిమాలు ఇవే..!?

N.ANJI
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే కొన్ని సందర్భాలలో ఎన్టీఆర్ కి డేట్స్ బ్యాలెన్స్ కాలేక కొన్ని సినిమాలను వదులుకోవాల్సి వచ్చింది. ఆలా వదులుకున్న సినిమాలే సూపర్ హిట్ అయ్యాయి. అవి ఏంటో చూద్దామా. నితిన్ హీరోగా వినాయక్ దర్శకత్వంలో వచ్చిన సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ దిల్. ఈ కథను ముందు ఎన్టీఆర్‌కు చెప్పాడు దర్శకుడు వినాయక్. ఆది లాంటి హిట్ తర్వాత మరోసారి స్టూడెంట్ డ్రామా ఎందుకు అని వదిలేసాడు. సుకుమార్ కూడా ఈ సినిమా కథను ముందు ఎన్టీఆర్‌కు చెప్పినా కూడా ఎందుకో మరి వర్కవుట్ కాలేదు. మరీ ప్రేమకథ ఎక్కువైపోతుందని ఎన్టీఆర్ నో చెప్పినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి.

వినాయక్ దగ్గరే పని చేస్తున్నపుడు బోయపాటి శ్రీను భద్ర కథను ముందు అల్లు అర్జున్.. ఆ తర్వాత జూనియర్‌కు చెప్పాడు. కానీ కుదర్లేదు. వెంటనే అదే కథను రవితేజకు చెప్పి ఓకే చేయించుకుని హిట్ కొట్టాడు బోయపాటి. సురేందర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అయిన అతనొక్కడే కథను ముందుగా ఎన్టీఆర్‌కు చెప్పాడు.. అయితే అది అనుకోకుండా కళ్యాణ్ రామ్ దగ్గరికి వచ్చి అతన్ని హీరోగా, నిర్మాతగా నిలబెట్టింది.

అశోక్, అతిథి లాంటి ఫ్లాపుల తర్వాత సురేందర్ రెడ్డి కిక్ కథను ఎన్టీఆర్‌కు వినిపిస్తే అది ఆయన వదిలేసాడు.. ఆ తర్వాత రవితేజ చేస్తే బ్లాక్‌బస్టర్ అయింది. వివి వినాయక్‌తో ఎన్టీఆర్‌కు చాలా అనుబంధం ఉంది. ఆ రిలేషన్‌తో కృష్ణ కథ వినిపిస్తే ఎందుకో కానీ జూనియర్‌కు కనెక్ట్ కాలేదు. కానీ అదే రవితేజకు బ్లాక్‌బస్టర్ ఇచ్చింది. బృందావనం సినిమాకు కలిసి పని చేసిన అనుభవంతో కొరటాల శివ వెళ్లి జూనియర్ ఎన్టీఆర్‌కు శ్రీమంతుడు కథ చెప్పాడు కానీ ఆయన చేయలేదు.. అదే సినిమా మహేష్ బాబు చేస్తే ఇండస్ట్రీ హిట్ అయింది.

వంశీ పైడిపల్లి ముందు నాగార్జున, ఎన్టీఆర్ హీరోలుగా ఊపిరి సినిమా అనౌన్స్ చేసాడు. అయితే అందులో నాగ్ కాళ్లు పట్టుకోవాల్సిన సన్నివేశాలు ఉండటంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి ఒత్తిడి వచ్చిందని టాక్. అందుకే ఈ చిత్రం ఆయన తప్పుకున్నాడు.. కార్తి వచ్చాడు. అనిల్ రావిపూడి రాజా ది గ్రేట్ సినిమాను ముందు ఎన్టీఆర్‌తోనే చేయాలనుకున్నాడు. దిల్ రాజు కూడా ఓకే అన్నాడు.. కానీ చివరి నిమిషంలో రవితేజ వచ్చాడు.. ఆ సినిమా కూడా మంచి విజయమే సాధించింది. ఒకవేళ ఈ సినిమాలన్నీ ఎన్టీఆర్ చేసుంటే మాత్రం ఆయన కెరీర్ మరింత హైలో ఉండేదేమో..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: